24.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఆ వైసీపీ సిట్టింగ్ సీటుని టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమేనట…

ఆ వైసీపీ సిట్టింగ్ సీటుని టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమేనట…

- Advertisement -

అమరావతి: ఒంగోలు పార్లమెంట్ స్థానం…చాలా సంవత్సరాలు టీడీపీ గెలుపుకి దూరమైన స్థానాల్లో ఇదొకటి. ఆ పార్టీ ఆవిర్భావించక 1984లో ఒకసారి మళ్ళీ 1999లో మరోసారి మాత్రమే ఇక్కడ టీడీపీ విజయం సాధించింది.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై సుమారు 15 వేల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ సారి మాగుంట వైసీపీ నుంచి బరిలో దిగడంతో…టీడీపీ మంత్రి శిద్ధా రాఘవరావుని పోటీకి దించింది.

చదవండి: చంద్రబాబు జోష్ వెనుక ఉన్న కారణం అదేనా..?

అయితే ఎమ్మెల్యే అభ్యర్ధులతో సంబంధం లేకుండా…ఈ ఇద్దరికీ ఒంగోలుపై మంచి పట్టుంది. పైగా గతంలో ఎప్పుడూ లేనట్టుగా పోలింగ్ శాతం ఏకంగా 85 వరకు చేరడంతో అభ్యర్థులు ఇద్దరు గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు.  ఎవరికి వారు పోలింగ్ బూతులు వారీగా లెక్కలు వేసుకుంటూ మెజారిటీ తమకంటే తమకే అని లెక్కలు వేస్తున్నారు.

ఎర్రగొండపాలెం, గిద్దలూరు, ద‌ర్శి నియోజకవర్గాల్లో తమకు 50 వేల ఓట్ల ఆధిక్యం వస్తుందని వైసీపీ ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో ఒక్క ఎర్రగొండపాలెంలో వైసీపీకి 19వేల మెజారిటీ వచ్చింది. దానితోనే వైసీపీ విజయం సాధ్యమైంది.

ఈ సారి కూడా ఒంగోలు, కొండపి, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థికి ఓట్లు తగ్గినా… పైమూడు నియోజకవర్గాల్లో వచ్చే మెజార్టీతో గెలిచేస్తామని అంటున్నారు.

శిద్ధాకి క్రాస్ ఓటింగ్..

అయితే టీడీపీ ఈ సారి ఒంగోలు దక్కించుకోవాలని గట్టిగా పోరాడింది. అందుకే శిద్ధాని బరిలో దించింది. శిద్ధా ఉండటం వలన ఎమ్మెల్యే అభ్యర్ధులతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలుస్తోంది. ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కొండపి , ఒంగోలు నియోజక వర్గాల్లో క్రాస్ ఓటింగ్ ప్రభావం శిద్ధాకు అనుకూలంగా జరిగినట్టు టిడిపి వర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

ఇక ఒంగోలు, దర్శిలలో అయితే శిద్ధాకి క్రాస్ ఓటింగ్ బాగా జరిగిందని తెలుస్తోంది. అటు ఎర్రగొండపాలెంలో వైసీపీ ఎంపీ అభ్యర్ధికి తక్కువ మెజారిటీ వచ్చేలా చేశారని సమాచారం. మొత్తం మీద చూసుకుంటే శిద్ధా 25-40 వేల మెజారిటీతో గెలవడం ఖాయమని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు.

చదవండి:   అన్నింట్లోనూ తాతగారి లాగే.. అంతే ఘనంగా ఎన్టీఆర్ పెళ్లి…

 

- Advertisement -