
- Advertisement -
నారాయణ్‌పూర్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. నారాయణపూర్ జిల్లాలోని అబుజ్‌మార్గ్ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.ఈ నెలలో ఇది రెండో భారీ ఎన్‌కౌంటర్. ఇంతకుముందు ఆగస్టు 3న రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా ఏడుగురు మావోయిస్టులు మరణించారు.
కూంబింగ్ చేపడుతున్న పోలీసులపై మావోయిస్టులు తొలుత కాల్పులకు దిగారని. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారని అధికారులు తెలిపారు.
ఇరువర్గాల మధ్య దాదాపు 90 నిమిషాలపాటు ఎదురుకాల్పులు సాగాయని, ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను గుర్తించామని డీజీపీ డీఎం అవస్థి తెలిపారు.
- Advertisement -








