28.5 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం స్వీపర్ ఉద్యోగం.. దానికి ఎంటెక్, బీటెక్, ఎంబీఏ గ్రాడ్యుయేట్ల పోటాపోటీ… వేలల్లో దరఖాస్తులు!

స్వీపర్ ఉద్యోగం.. దానికి ఎంటెక్, బీటెక్, ఎంబీఏ గ్రాడ్యుయేట్ల పోటాపోటీ… వేలల్లో దరఖాస్తులు!

sweeper
- Advertisement -

sweeper

చెన్నై: ఏడాదికేడాది చదువు పూర్తి చేస్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోతోంది. అదే స్థాయిలో ఉద్యోగాలు మాత్రం పెరగడం లేదు. దీంతో తమ చదువుకు సంబంధం లేకున్నా ఇతర రంగాల్లో ఉద్యోగం చేసేందుకు ప్రయత్నిస్తోంది నేటి యువత.

దీంతో అన్ని ఉద్యోగాలకు భారీగా డిమాండ్ పెరిగిపోతున్నాయి, చివరకు స్వీపర్ పోస్టులకు కూడా ఇంజినీర్లు, ఎంబీఏ గ్రాడ్యూయేట్లు పోటీ పడుతున్న పరిస్థితి ఏర్పడింది. తాజాగా, తమిళనాడులో ఈ పరిణామం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్‌లో స్వీపర్‌, సానిటరీ కార్మికుల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. కాగా, ఈ పోస్టులకు ఎంటెక్‌, బీటెక్‌, ఎంబీఏ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్ల నుంచి వేలాది దరఖాస్తులు వచ్చి పడ్డాయి. వీరితో పాటు డిప్లామో పట్టా పొందిన వారు కూడా స్వీపర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

వేలల్లో దరఖాస్తులు…

మొత్తం 10 స్వీపర్‌ పోస్టులు, 4 శానిటరీ కార్మికుల పోస్టులకు గాను గత ఏడాది సెప్టెంబర్‌ 26న తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. సంబంధిత విభాగంలో అనుభవం ఉంటే సరిపోతుందని పేర్కొంది. దీంతో ఎంప్లాయిమెంట్‌ ఎక్సైంజ్‌తో సహా మొత్తం 4,607 దరఖాస్తులు అందాయి. వీరిలో డిగ్రీలు, ఎంబీఏలు, బీటెక్‌లు చదివిన వారు కూడా ఉన్నారు.

కాగా, ఇలా వచ్చిన దరఖాస్తుల్లో సరైన వివరాలు నమోదు చేయనందున దాదాపు 677 మంది దరఖాస్తులను సంబంధిత అధికారులు తిరస్కరించారు. స్వీపర్ ఉద్యోగాలకు కూడా డిగ్రీలు, పీజీలు చదివిన వారు అప్లై చేసుకోవడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు.. ఏదైతేనే అన్నట్లు ఉంది నేటి పరిస్థితి.

- Advertisement -