23.4 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం 48 గంటల వ్యవధిలో 36 మంది చిన్నారుల మరణం… కారణం..?

48 గంటల వ్యవధిలో 36 మంది చిన్నారుల మరణం… కారణం..?

bihar News, children dead News, hypoglycemia News, Newsxpressonline
- Advertisement -

బీహార్ : రాష్ట్రంలో చిన్నారుల మృతి ఆందోళనను కలిగిస్తోంది. ముజఫర్ పూర్ జిల్లాలో మెదడు వాపు వ్యాధి లక్షణాలతో 48 గంటల వ్యవధిలో 36 మంది చిన్నారులు చనిపోయారు. రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోవడం వల్లే అంటే హైపోగ్లైసీమియా వల్ల పిల్లలు ఇలా చనిపోతున్నారని వైద్యులు తెలిపారు. కాగా… మరో 133 మంది చిన్నారులు హైపోగ్లైసీమియాతో చికిత్స పొందుతుండగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

చదవండి: ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి!

ముజఫర్ పూర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్పిటళ్లు హైపోగ్లైసీమియాతో బాధపడుతున్న చిన్నారులతో నిండిపోయాయ్. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ ప్రాంతంలో ఈ వ్యాధితో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని … చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయ్.

జిల్లాలో 90శాతం మంది చిన్నారులు ఇదే కారణంతో చనిపోతున్నా.. వేసవిలో ఇదే వ్యాధి కారణంగా శిశు మరణాల రేటు పెరుగుతున్నా… పట్టించుకోకపోవడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోంది.

కాగా… గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం కారణంగా కూడా ఈ వ్యాధి వల్ల చనిపోయే పిల్లల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు వైద్యాధికారులు. పేదరికం వల్ల చిన్నారులకు ఆహారం పెట్టకుండా రాత్రి ఖాళీ కడుపుతో పడుకోబెడితే బ్లడ్ లో షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని చెబుతున్నారు. తద్వారా మెదడు వాపు వ్యాధి, హైపోగ్లెసీమియా వ్యాధి లక్షణాలతో పిల్లలు చనిపోతున్నారని పేర్కొన్నారు.

- Advertisement -