
లండన్: బొటనువేలు గాయం కారణంతో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్….వరల్డ్ కప్ టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా…బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధావన్‌కు ఎడమచేతి బొటన వేలుకు గాయమైంది.
అయితే గాయం వలన ధావన్ కు మూడు వారాల పాటు విశ్రాంతి ఇవ్వాలని జట్టు యాజమాన్యం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ధవన్ ఇంగ్లండ్‌లోనే చికిత్స తీసుకుంటాడనీ.. అతడు ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని భారత జట్టు ప్రకటించింది.
ఇక శిఖర్ ధవన్ స్థానంలో ఆడేందుకు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అవకాశం దొరికింది. టీమ్ మేనేజ్‌మెంట్ విజ్ఞప్తి మేరకు బీసీసీఐ ఈరోజ్ పంత్‌ను భారత్ నుంచి ఇంగ్లండ్ పంపుతున్నట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. ఈరోజు సాయంత్రానికి పంత్ ఇంగ్లండ్ కు చేరుకునే అవకాశం ఉంది. అయితే పంత్ తుది జట్టులో ఆడతాడో లేదో చూడాలి.








