కలకలం: ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా పాజిటివ్! ఎక్కడంటే…

- Advertisement -

లక్నో: దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. కొన్ని రోజులుగా రోజూ 70 వేలకుపైగానే కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాందా పట్టణంలో ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. 

ఈ పట్టణంలో సోమవారం సాయంత్రం కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు బయటపడగా.. వీటిలో 32 మంది పుతాకౌన్ ప్రాంతంలో నివసించే ఒకే కుటుంబానికి చెందిన వారు. 

ఈ విషయాన్ని జిల్లా ముఖ్య వైద్య అధికారి ఎన్‌డీ శర్మ నిర్ధారించారు. ఇప్పటి వరకు బాందా జిల్లాలో 807 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. 

కరోనా రోగుల్లో ఇప్పటి వరకు 439 మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా, ఇంకా 360 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 

మరోవైపు యూపీ.. దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,30,414 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

వీరిలో 3,486 మంది మరణించగా.. కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 1,72,140 మంది.. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 54,788.

 

- Advertisement -