23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం గ్రీన్ సిగ్నల్: అయోధ్య కేసులో సుప్రీం కీలక తీర్పు, శ్రీశ్రీ సహా మధ్యవర్తులు వీరే..

గ్రీన్ సిగ్నల్: అయోధ్య కేసులో సుప్రీం కీలక తీర్పు, శ్రీశ్రీ సహా మధ్యవర్తులు వీరే..

- Advertisement -

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో ‘మధ్యవర్తిత్వా’నికే సుప్రీం కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించవచ్చా? లేదా? అనే విషయంపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.

మధ్యవర్తులు వీరే..

సమస్య శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మేలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. పండిట్‌ శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు, జస్టిస్ ఎఫ్ఎమ్ ఖలీఫుల్లాలతో మధ్యవర్తి ప్యానల్‌ను ఏర్పాటు చేసింది.

4 వారాల్లోగా మొదటి నివేదిక ఇవ్వాలని.. 8 వారాల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేగాక, మీడియాకు ఏలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచాలని సూచించింది.

మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్‌లో కొనసాగాలని పేర్కొంది. చర్చలన్నీ సీసీ కెమెరా పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా కొనసాగాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో మధ్యవర్తుల సూచనలు కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది.

చదవండి: జరిగింది మార్చలేం: అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్‌లో పెట్టిన సుప్రీం

- Advertisement -