
అనంతపురం: ఏపీ ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన జిల్లా అనంతపురం. గత ఎన్నికల్లో రాయలసీమలోని మిగిలిన మూడు జిల్లాలో వైసీపీ విజయవిహారం చేసిన ఈ అనంతపురం జిల్లా మాత్రం తెలుగుదేశం వైపు మొగ్గు చూపింది. రాయలసీమలో తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు వచ్చింది కూడా ఇక్కడే.
మరి 2014 ఎన్నికల తరువాత ఈ జిల్లాలో చాలా మార్పులు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇటీవల ఓ సర్వే సంస్థ ఈ జిల్లా ఫైనల్ ఫలితాలు వెల్లడించింది.
టీడీపీ వర్సెస్ వైసీపీ..
వివరాలు ఇప్పుడు చూద్దాం..ఈ అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజక వర్గాలు ఉన్నాయి. మొతం నియోజకవర్గాలలో తెలుగుదేశం విషయానికి వస్తే 14 నియోజక వర్గాల్లో..కేవలం3 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం మొదటి స్థానంలో ఉంది. అంటే ఈ 3 స్థానాలలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎగిరేది టీడీపీ జెండానే.
మరో నాలుగు స్థానాల్లో తెలుగుదేశం సెకండ్ ప్లేస్ లో ఉంది. వీటిని టీడీపీ నేతలు కొంచెం కష్టపడితే సులభంగా గెలుచుకోవచ్చు. ఏడూ స్థానాల్లో తెలుగుదేశం మూడో స్థానంలో ఉంది. ఇక వీటిని తెలుగుదేశం గెలుచుకోవడం దాదాపు అసాధ్యం అని తెలుస్తోంది. ఇక ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ విషయానికి వస్తే 14స్థానాల్లో 10 స్థానాల్లో మొదటి స్థానంలో ఉంది. మరో నాలుగు స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో ఉంది.
ఇక్కడ వైసీపీ 10 సీట్లలో మొదటి స్థానంలో ఉండటానికి గల కారణం జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర అని తెలుస్తోంది. జగన్ అనంతపురం లో పాదయాత్ర చేసే సమయంలో అనంతపురం ప్రజలు బ్రహ్మరధం పట్టారు.
జనసేన పార్టీ విషయానికి వస్తే, ఈ పార్టీ మొదటి స్థానంలో ఒక్క స్థానంలో కూడా లేదు. ఒక స్థానంలో సెకండ్ ప్లేస్ లో ఉంది. మరో 13 స్థానాల్లో మూడో స్థానంలో ఉంది. మొత్తంగా చూస్తే, అనంతపురం జిల్లాలో వైసీపీ 10 స్థానాలు, టీడీపీ 3 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. జనసేన కష్టపడితే ఒక స్థానం గెలవచ్చు అని తెలుస్తోంది. ఇక రెండు ఎంపీ సెగ్మెంట్లు కూడా వైసీపీ గెలుచుకునే అవకాశాలు 70శాతం ఉన్నాయి అని సర్వే లో వెల్లడైంది. చూడాలి మరి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో…
సంబంధిత వార్తలు :
చంద్రబాబుకి మైండ్ బ్లోయింగ్ షాక్! వైసీపీలోకి ఆ కీలక నటి!
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019: కడప జిల్లా తాజా సర్వే! అధిపత్యమా.. అవమానమా?








