26.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు జిల్లాలు ఊసరవెల్లి కంటే ఘోరంగా రంగులు మారుస్తావ్: బాబుపై కన్నా ఫైర్…

ఊసరవెల్లి కంటే ఘోరంగా రంగులు మారుస్తావ్: బాబుపై కన్నా ఫైర్…

kanna lakshminarayana fires on chandrababu
- Advertisement -

అమరావతి: ప్రధాని మోడీకి డ్రెస్‌లంటే పిచ్చి అని…ఆయన గంటకో డ్రెస్ మారుస్తారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించిన విషయం తెలిసిందే. అలాగే మోడీ గంటకో డ్రెస్ మారుస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఒకే డ్రెస్‌తో ఉంటున్నారని, ప్రధానికి డ్రెస్‌లపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు…మోడీపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా స్పందించారు. మోడీ గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదుగానీ చంద్రబాబు మాత్రం ఊసరవెల్లి కంటే ఘోరంగా రంగులు మారుస్తారని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

అసలు నిమిషానికి ఒక మాట మారుస్తావ్…. నిజాయితీగా ఉండే అధికారుల సీటు మారుస్తావ్. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాళ్ల పార్టీ మారుస్తావ్ అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఇక మే 23న ఏపీ ప్రజలు నీ సీటు మారుస్తారంటూ ఎద్దేవా చేశారు. మరి కన్నా వ్యాఖ్యలకి టీడీపీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.

చదవండి: జీవీఎల్ రాసిన పుస్తకంపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..

- Advertisement -