23.4 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు జిల్లాలు మే 23 తర్వాత నీ సంగతి చెప్తా: సింహాచలం ఆలయ ఈవోకి అవంతి వార్నింగ్..

మే 23 తర్వాత నీ సంగతి చెప్తా: సింహాచలం ఆలయ ఈవోకి అవంతి వార్నింగ్..

- Advertisement -

విశాఖపట్నం: ఎన్నికల ఫలితాలు రాకముందే వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చేశామని ఫీలింగ్‌లో ఉన్నట్లున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల వైసీపీ నేతలు అధికారులకు వార్నింగ్ ఇచ్చే పనిలో బిజీగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ సింహాచలం దేవస్థానం ఈవోపై బెదిరింపులకు పాల్పడ్డారు. మే 23 తర్వాత నీ సంగతి చెప్తా అంటూ ఫైర్ అయిపోయారు.

చదవండి: ఏపీ కేబినెట్‌ భేటీపై స్పదించిన సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం! ఏమన్నారంటే…

అసలు ఏం జరిగిందంటే?

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చందనోత్సవం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు సింహాచలం తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే స్వామివారి దర్శనానికి వచ్చిన వైసీపీ నేత అవంతి శ్రీనివాస్‌ని గర్భగుడిలోకి వెళ్ళేందుకు ఆలయ ఈవో అనుమతి ఇవ్వలేదు.

దీంతో అవంతి ఈవోపై ఫైర్ అయ్యారు. తాను ఇంకా సిట్టింగ్ ఎంపీనని..గుర్తుచేస్తూనే…మే 23 తర్వాత నీ పని చెబుతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఆనవాయితీ ప్రకారం పూజపాటి రాజవంశస్థులు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు వరాహ లక్ష్మీ నరసింహస్వామికి తొలి చందనం సమర్పించి, నిజరూప దర్శనం చేసుకున్నారు.

చదవండి:  2020కి కూడా పోలవరం పూర్తవుతుందన్న గ్యారెంటీ లేదు: ఉండవల్లి అరుణ్ కుమార్      
- Advertisement -