22.6 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు జిల్లాలు రాప్తాడులో గెలిచేదెవరు? బెట్టింగుల్లో మునిగితేలుతున్న పందెం రాయుళ్ళు…

రాప్తాడులో గెలిచేదెవరు? బెట్టింగుల్లో మునిగితేలుతున్న పందెం రాయుళ్ళు…

heavy bettings in rapthadu
- Advertisement -

 

అనంతపురం: రాష్ట్రంలో హోరాహోరీ పోరు జరిగిన స్థానాల్లో రాప్తాడు ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ పరిటాల శ్రీరామ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల ఫైట్ జరిగింది. గత రెండు ఎన్నికల్లో రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తోపుదుర్తిపై విజయం సాధించారు.

అయితే ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఆమె ఎన్నికల పోరు నుంచి తప్పుకుని కుమారుడుకి టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో రాప్తాడులో టీడీపీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్‌ పోటీకి దిగారు. ఇక మూడోసారి కూడా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డే వైసీపీ పక్షాన ప్రత్యర్థిగా నిలబడ్డారు.

హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేసిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం ఉండటంతో బెట్టింగ్ రాయుళ్ళు పండుగ చేసుకుంటున్నారు.

పోలింగ్‌కీ, కౌంటింగ్‌కీ మధ్య గ్యాప్‌ ఎక్కువ ఉండటంతో బెట్టింగ్‌లు భారీగా పెరిగిపోయాయి. కొందరు శ్రీరామ్‌ గెలుపుపై కోట్లాది రూపాయలు పందేలు కాస్తుండగా..కొందరు తోపుదుర్తి గెలుపుపై బెట్టింగ్ వేస్తున్నారట. ఇక మరికొందరు పరిటాల సునీత కంటే శ్రీరామ్‌కు ఎక్కువ మెజారిటీ వస్తుందని పందేలు కాశారట.

మొత్తం మీద ఫలితాలు అయితే మరో 19 రోజుల్లో తెలియనున్నాయి. మరి ఇక్కడ ఎవరు గెలిచి బెట్టింగ్‌రాయుళ్లుకి లాభం తెచ్చిపెడతారో చూడాలి.

చదవండి: వైసీపీలోకి జంప్ కొట్టేందుకు చూస్తున్న ఇద్దరు మంత్రులు….?

 

- Advertisement -