28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జిల్లాలు టీఆర్ఎస్‌లోకి జగ్గారెడ్డి జంపింగ్ లేనట్లేనా…?

టీఆర్ఎస్‌లోకి జగ్గారెడ్డి జంపింగ్ లేనట్లేనా…?

congress mla jaggareddy
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో 11 మంది టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. మరో ఇద్దరినీ టీఆర్ఎస్ లాగేసుకుంటే కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది.

చదవండి: కేటీఆర్‌వి అబద్ధాలు, ఆయన హయాంలోనే గ్లోబరీనాకు టెండర్: రేవంత్ రెడ్డి

మరోవైపు సీఎల్పీ.. టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం అయ్యే అవకాశం ఉంది.  దీంతో మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గులాబీ గూటికి చేరడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పార్టీ మార్పు ప్రచారంపై మరోసారి క్లారిటీ…

ముందు నుంచీ ఈ ప్రచారం జరుగుతున్నా… జగ్గారెడ్డి మాత్రం తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చాలాసార్లు మీడియా ముందు చెప్పారు. అయినా ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు.  దీంతో పార్టీ మార్పు ప్రచారంపై మరోసారి జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

తాను పార్టీ మారనని, ఇతర పార్టీలోకి రావాల్సిందిగా తనకు ఎలాంటి ఆహ్వానం అందలేని చెప్పారు. అయితే నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే తాను నిర్ణయాలు తీసుకుంటానని వెల్లడించారు. 

చదవండి: జగన్ విషయం ఏపీ ప్రజలే చూసుకుంటారు: కేటీఆర్

గతంలో కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అది కూడా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలిస్తేనే వెళ్లినట్లు చెప్పుకొచ్చారు.

అప్పుడు పార్టీ మారడం వల్ల సంగారెడ్డికి ఎంతో మేలు జరిగిందని, ఇప్పుడు కూడా ఏం చేసినా.. ప్రజల ప్రయోజనాల కోసమే చేస్తానని చెప్పారు. మొత్తం మీద జగ్గారెడ్డి మాటలని బట్టి చూస్తుంటే ఆయన పార్టీ మారే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లుంది.

సమయం వస్తే జగ్గారెడ్డి జంపింగ్ కొట్టడం ఖాయమే అని అర్ధమవుతోంది. కాకపోతే బంతిని ప్రజాకోర్టులో వదిలేశారు.. అంతే!

- Advertisement -