
హైదరాబాద్: మెగా బ్రదర్ , జనసేన పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు , వైసీపీ సీనియర్ నేత , రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణపై ట్వీట్ చేసే నైతికత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి లేదని చెప్పాడు.
ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తరువాత కూడా ప్రతి వాళ్లూ, నాకెన్ని సీట్లు వస్తాయ్, నా సర్వేలో ఇంత వచ్చింది, నీ సర్వేలో ఇంత వచ్చింది ఇవ్వన్నీ దేనికి అని , ఇప్పటికే ప్రజా తీర్పునిక్షిప్తం అయ్యింది.
మరికొన్నిరోజుల్లో ఎన్నికల ఫలితాలు ఎలాగో వస్తాయి. ఈలోపు పార్టీలన్నీ సర్వేలాంటూ హడావుడిలు ఎందుకు చేస్తున్నాయంటూ విమర్శించారు. చంద్రబాబు సమీక్షలపై సమీక్షలు పెడుతుంటే జగన్ విజయసాయిరెడ్డితో వింత ట్వీట్లన్నీ చేయిస్తున్నారని నాగబాబు ఎద్దేవా చేశారు.
చదవండి: జగన్‌కి బిగ్ షాక్! చంద్రబాబు గెలిస్తే.. మళ్ళీ అక్కడే ప్రమాణ స్వీకారం!
విజయసాయిరెడ్డి ఒకప్పుడు తన స్నేహితుడన్నారు. ఆయనక సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మీద ట్వీట్ చేసేంత నైతికత ఉందా అంటూ ప్రశ్నించారు. ఆయనెక్కడ, విజయసాయిరెడ్డి ఎక్కడ అంటూ ఎద్దేవా చేశారు.
ఒకట్రెండు సార్లు విజయసాయిరెడ్డి ట్వీట్లు చదివానని, ఆ తర్వాత నీతో దరిద్రం మాకొద్దు అంటూ పనులున్నాయని చెప్పి వదిలించుకున్నానని నాగబాబు సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ హాయిగా రూములో కూర్చని పుస్తకాలు చదువకుంటూ మనశ్శాంతిగా ఉన్నారన్నారు.








