జగన్ సొంత సర్వేలో ఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి!

YS Jagan Latest News, Jagan Latest Survey News, AP News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఎన్నికల తరుణంలో సర్వేలు సహజం. ఇటు అధికార పార్టీతోపాటు అటు ప్రతిపక్షం, అలాగే ఇతర పార్టీలు కూడా ఈ సర్వేలపైనే ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. టిక్కెట్ల కేటాయింపు విషయంలోనూ అంతర్గత సర్వేలపైనే అన్ని పార్టీలూ ఆధారపడుతుంటాయి. 

ఈ సర్వేల పర్వం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర్నించి.. పోలింగ్ జరిగి, ఫలితాలు వెల్లడయ్యే వరకూ కొనసాగుతూనే ఉంటుంది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయా పార్టీలు కూడా ఇలా సర్వేలపైనే ఆధారపడ్డాయి. టిక్కెట్ల కేటాయింపు విషయంలోనూ ఆయా నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకున్నాయి.

ఈ అంతర్గత నివేదికల ఆధారంగానే ఆయా పార్టీలు అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. అంతే కాదు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత కూడా ఈ సర్వేల హడావిడి ఏ మాత్రం తగ్గలేదు.

పలు పార్టీలు ఇప్పటికీ గెలుపు అవకాశాలపై సర్వేలు చేయించుకుంటున్నాయి. తమ పార్టీ పరిస్థితి ఏంటన్నదానిపై వాటి ఆధారంగానే ఒక అంచనాకు వస్తున్నాయి.

వైఎస్సార్సీపీ విషయానికొస్తే.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా చేయించుకోకపోయినా, ఆయన పార్టీలో పెద్ద తలకాయలు ఇలాంటి సర్వేలు చేయించాయట. ఇలాంటివి దాదాపు ఆరు సర్వే రిపోర్టులు ఇప్పుడు వైఎస్ జగన్ చేతికి చేరాయట.

ఇంతకీ ఆ సర్వే రిపోర్టుల్లో ఏముందంటే.. ఈ ఆరు సర్వేల్లో ఒకే ఒక్క సర్వే 80 నుంచి 90 మధ్యలో జగన్‌ పార్టీకి సీట్లు వస్తాయని చెప్పిందట.

అన్ని సర్వేల్లోనూ గెలుపు జగన్‌వైపే…

మిగిలిన అన్న సర్వేలు 90 సీట్లకు పైనే ఫిగర్ చెప్పాయట. కొన్ని సర్వేల్లో అయితే వైఎస్సార్సీపీకి ఏకంగా 130 సీట్ల వరకూ రావచ్చని కూడా చెప్పాయట. అంటే దాదాపు అన్ని సర్వేలు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ గెలుపునే ఖాయం చేశాయన్నమాట.

ఈ సర్వేల మాట ఎలా ఉన్నా.. జగన్ ఎక్కువగా నమ్మే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మాత్రం జగన్ పార్టీకి 115 నుంచి125 వరకూ సీట్లు వస్తాయని ఇప్పటికే రిపోర్టు ఇచ్చేశాడని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు నేతలంతా ఈ సర్వే రిపోర్టులన్నీ ముందేసుకుని ఎక్కడ లాభపడతాం, ఎక్కడ నష్టపోతున్నామనే లెక్కలు వేసుకుంటున్నారు.

చదవండి: చంద్రబాబుకి బిగ్ షాక్! చేతులెత్తేసిన కర్నూల్ టీడీపీ నేతలు!

నిజానికి రాష్ట్రంలో ఎన్నికల నాటికి అటు టీడీపీ ఇటు వైసీపీలు.. నువ్వా? నేనా? అన్న‌ట్టు సమఉజ్జీలుగా ఉన్నాయ‌ట‌. ఒక‌చోట టీడీపీ బ‌లంగా ఉంటే మ‌రోచోట వైసీపీ బ‌లంగా నిలిచింద‌ట‌. తీరా పోలింగ్ ముగిసిన తరువాత మాత్రం పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందట.  ఫలితాలు వెలువడే వరకు ఈసారి రాష్ట్రంలో అధికారం ఎవ‌రిదో చెప్ప‌డం చాలా క‌ష్ట‌మ‌ని రాజకీయ విశ్లేషకులే భావిస్తున్నారట.

విడిగా పోటీ చేస్తేనే లాభదాయకమని…

మరోవైపు జనసేన, బీజేపీ.. తాము విడిగా పోటీ చేస్తేనే లాభదాయకమని తొలుత భావించి ఎవరికి వారు విడిగా ఎన్నికల బరిలోకి దిగారు. తీరా ఇప్పుడు నివేదికలు చూసి బీజేపీ ఒక్క‌సారిగా కంగుతింద‌ట‌.

వైఎస్ జ‌గ‌న్ హ‌వా సోష‌ల్ మీడియాలోనే త‌ప్ప జ‌నాల్లో మాత్రం నిల్ అని తేలింద‌ట‌. దీంతో ఇక మీదట అయినా సరే కొంచెం శ్రద్ద వహించాలని.. త‌మ‌ వ్యుహాలకి పదును పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

మ‌రోవైపు టీడీపీ కూడా త‌న వ్యూహాల‌కి ప‌దునుపెట్టాల‌ని బావిస్తోంది.  ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది ఒక ఎత్తు అయితే.. ఇప్ప‌టి నుండి జ‌రిగేవి మ‌రో ఎత్తు.

అయితే బీజేపీ అధిష్ఠానం మాత్రం మరో మూడు వారాల తరువాత తాజా రిపోర్ట్ పంపమని ప్రశాంత్ కిషోర్‌కి చెప్పిందట.  మరికొద్ది రోజుల్లో పీకే ఇచ్చే  ఆ రిపోర్ట్ చూస్తేగానీ 2019లో అధికారం ఎవ‌రిదో ఒక అవ‌గాహ‌న‌కు రావొచ్చ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

చదవండి:  ఏపీలో అలజడి సృష్టిస్తోన్న కొత్త సర్వే..!
- Advertisement -