మధ్యాహ్న భోజన పథకం పేరు మార్చిన సీఎం జగన్…

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వైఎస్ జగన్….ప్రభుత్వంలో అనేక కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అధికారులని బదిలీ చేసి కొత్తవారిని నియమించుకున్న విషయం తెల్సిందే. అలాగే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రమాణస్వీకారం మొదటిరోజే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకాన్ని వైఎస్సార్ పెన్షన్ స్కీమ్‌గా మార్చిన సీఎం జగన్… తాజాగా మరో పథకానికి కూడా వైఎస్సార్ పేరు పెట్టారు. ఏపీలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్… ఆ పథకానికి వైఎస్సార్ అక్షయపాత్రగా నామకరణం చేశారు. ఇక మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు ప్రస్తుతం నెలకు ఇస్తున్న రూ.1000 గౌరవవేతనాన్ని రూ.3వేలకు పెంచారు.

పెంచిన పెన్షన్లు జూలై నుంచి అమలు…

పెంచిన వైఎస్సార్ పెన్షన్ పథకం సాయం జులై  నుంచి లబ్ధిదారులకు చేరనుంది. పెన్షన్లని 2 వేల నుంచి రూ.2,250కు పెంచుతూ వైఎస్‌ జగన్‌ తొలి సంతకం చేసిన విషయం విదితమే. దీంతో పాటు పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు.

అలాగే డయాలసిస్‌ రోగుల (కిడ్నీ బాధితులు)కు ప్రతి నెల రూ.10 వేలు, వైకల్యశాతంతో సంబంధం లేకుండా దివ్యాంగులందరికీ రూ.3 వేల చొప్పున అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ జులై మొదటి వారంలో లబ్ధిదారులకు అందించనున్నారు.

చదవండి: సీఎం హోదాలో తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టనున్న జగన్…
- Advertisement -