హైదరాబాద్: తొలిసారిగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అమిర్ ఖాన్ వెండితెర పై కలిసి నటిస్తున్న సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’. భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధూమ్ 3 ఫేం విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. ‘కన్ఫెషన్స్ ఆఫ్ థగ్స్’ నవలను ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ సంస్థ అత్యదిక బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నఈ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ సినిమాను దక్షిణాది భాషలు అయిన తెలుగు, తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను చాలా వినూత్నంగా ప్రారంభించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంకా ఆమిర్ ఖాన్ స్వయంగా తెలుగులో మాట్లాడుతూ తమ సినిమా తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఈ దీపావళి సందర్భంగా రిలీజ్ అవుతుందని తెలిపారు. ఈ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ ’ హిందీ వర్షన్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ నవంబర్ 8న రిలీజ్ కాబోతుంది.
For the first time @SrBachchan and @aamir_khan are coming together to give you a Diwali Dhamaka. #ThugsOfHindostan releasing on 8th November in Telugu! #KatrinaKaif | @fattysanashaikh | #VijayKrishnaAcharya | @yrf pic.twitter.com/EwXzT30J1t
— #ThugsOfHindostan (@TOHTheFilm) September 26, 2018