
ప్రపంచంలో చాలా మంది నేడు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. థైరాయిడ్ సమస్య రెండు రకాలు. ఒకటి- హైపో థైరాయిడిజం, రెండు-హైపర్ థైరాయిడిజం. ఈ రెండింటిలో దేని బారిన పడినా మనకు అనేక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. నిజానికి ఏ థైరాయిడ్ సమస్య అయినా.. కచ్చితమైన ఆహారం తీసుకుంటే దాన్నుంచి బయట పడవచ్చు. మనం తీసుకునే ఆహారం మన శరీరం మెటబాలిజంను ప్రభావితం చేస్తుంది. కనుక అలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యను అధిగమించవచ్చు. మరి.. థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పెరుగు
పెరుగులో విటమిన్ డి, ప్రొబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథిని సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. జీర్ణాశయంలో మంచి బాక్టీరియాను పెంపొందిస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథిలో వచ్చే అసమతుల్యత తగ్గిపోతుంది.
చేపలు
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర మెటబాలిజంను క్రమబద్దీకరిస్తాయి. పైగా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు. కాబట్టి మన ఆహారంలో చేపలను చేర్చుకోవడం ద్వరా థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు.
కోడిగుడ్లు
మన శరీర మెటబాలిజంను క్రమబద్దీకరించే ప్రోటీన్లు, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్లు కోడిగుడ్లలో ఉంటాయి. కనుక కోడిగుడ్లను తరచూ తింటుండం వల్ల కూడా మెటబాలిజంను సరైన స్థాయిలో ఉంచుకోవచ్చు. దీంతో థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా పనిచేస్తుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. అలా విడుదలయ్యే కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది. దీంతో మెటబాలిజం క్రమబద్దీకరించబడుతుంది. అలా థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్‌లో మన శరీరానికి కావల్సిన డైటరీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియలను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది.
అయోడిన్ ఉన్న ఆహారం
అయోడిన్ ఎక్కువగా ఉన్న చేపలు, రొయ్యలు, పాలకూర, వెల్లుల్లి, నువ్వులు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో శరీరానికి అయోడిన్ అందుతుంది. తద్వారా థైరాయిడ్ గ్రంథి తగిన మోతాదులో థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. దీంతో ఆ సమస్య దూరమవుతుంది.
సెలీనియం, జింక్
పుట్ట గొడుగులు, మాంసం, పొద్దు తిరుగుడు విత్తనాలు, సోయా బీన్, పచ్చి బఠానీలు, వాల్‌నట్స్, గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు, బాదం పప్పులను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల సెలీనియం, జింక్ మన శరీరానికి అందుతాయి. ఫలితంగా థైరాయిడ్ హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. దీంతో థైరాయిడ్ సమస్య తగ్గిపోతుంది.








