22.2 C
Hyderabad
Sunday, November 29, 2026
- Advertisement -
Home మొబైల్ ప్రత్యేక ఫీచర్లతో శామ్‌సంగ్ నుంచి ఒకేసారి 4 కొత్త మొబైల్స్!

ప్రత్యేక ఫీచర్లతో శామ్‌సంగ్ నుంచి ఒకేసారి 4 కొత్త మొబైల్స్!

- Advertisement -

న్యూఢిల్లీ: కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శామ్‌సంగ్ ఒకేసారి నాలుగు కొత్త మొబైల్స్ ఆవిష్కరించింది. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఈ ఫోన్ల ధరలు రూ.13,990 నుంచి రూ.25,990 మధ్యలో ఉన్నాయి.  వీటిలో జే6, ఏ6, ఏ6 ప్లస్‌ మోడల్స్ మంగళవారం నుంచి అందుబాటులోకి రాగా, జే8 మాత్రం జూన్ చివరి వారం నుంచి లభించనున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడించాయి.

5.6, 6 అంగుళాల టచ్‌ స్క్రీన్లతో రూపొందిన ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఓరియో 8.0 ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగించారు.  ఇంకా..  3జీబీ ర్యామ్-32జీబీ మెమొరీ, 4జీబీ ర్యామ్-64 జీబీ మెమొరీ, ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 16 మెగాపిక్సెల్ వరకు కెమెరాలు, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఈ ఫోన్లలో ఒకవైపు వీడియో చూస్తూ మరోవైపు చాటింగ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉన్నదని కంపెనీ డైరెక్టర్ సుమిత్ వాలియా ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాదు, జే8 మోడల్ మొబైల్ ఫోన్‌ను పేటీఎం మాల్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.1,500 క్యాష్‌బాక్ ఆఫర్ కూడా లభించనుంది.

- Advertisement -