24.1 C
Hyderabad
Thursday, October 15, 2026
- Advertisement -
Home మొబైల్ 4 కెమెరాలతో హెచ్‌టీసీ ‘యూ12 ప్లస్’ స్మార్ట్‌ఫోన్!

4 కెమెరాలతో హెచ్‌టీసీ ‘యూ12 ప్లస్’ స్మార్ట్‌ఫోన్!

- Advertisement -

హెచ్‌టీసీ నుంచి 4 కెమెరాలతో కూడిన స్మార్ట్ ఫోన్ విడుదలైంది.  దీని పేరు  హెచ్‌టీసీ ‘యూ12 ప్లస్’. 64/128 జీబీ స్టోరేజి సామర్థ్యం కలిగిన ఈ ఈ ఫోన్ వరుసగా రూ.54,630, రూ.58,050 ధరలకు వినియోగదారులకు లభించనుంది. ఈ ఫోన్‌ను భారత్‌లో జూన్ నుంచి విక్రయించనున్నారు.  హెచ్‌టీసీ యూ12 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 6 అంగుళాల భారీ డిస్‌ప్లే ఉండడమేకాక దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తోంది.

ఈ ఫోన్‌లో అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేయడం వల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. వెనుక భాగంలో 12, 16 మెగాపిక్సల్ సామర్థ్యం కలిగిన  రెండు పవర్‌ఫుల్ కెమెరాలను అమర్చారు. వీటిలో 16 మెగాపిక్సల్ కెమెరా టెలిఫొటో కెమెరాగా పనిచేస్తుంది. ఫలితంగా ఆప్టికల్ జూమ్ వస్తుంది. ఇక ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలకు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు.

యూ 12 ప్లస్ ఫోన్‌లో డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ సదుపాయం ఉంది. దీని వల్ల వీవోఎల్‌టీఈ కెపాసిటీ ఉన్న రెండు సిమ్‌లను ఒకేసారి ఈ ఫోన్‌లో వేసుకుని వాడవచ్చు. అలాగే ఐపీ 68 రేటింగ్ ఉన్న వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను కూడా ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 3500 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి క్విక్ చార్జ్ 3.0 సపోర్ట్ కూడా ఉంది. ఫలితంగా కేవలం 35 నిమిషాల సమయంలోనే ఫోన్ బ్యాటరీ 0 నుంచి 50 శాతం వరకు చార్జింగ్ అవుతుంది.

యూ12 ప్లస్ ఫీచర్లు ఇవే…

6 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఎల్‌సీడీ 6 డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హెచ్‌టీసీ బూమ్ సౌండ్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

- Advertisement -