ఆరోగ్య వరదాయిని.. ‘తిప్పతీగ’! దీంతో కలిగే ప్రయోజనాలు ఎన్నెన్నో…

Many Benefits of Heart-Leaved Moonseed
- Advertisement -

ప్రకృతిలో మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. కానీ ఆ మొక్కల గురించి మనలో చాలామందికి తెలియదు. అలాంటి మొక్కల్లో ‘తిప్పతీగ’ కూడా ఒకటి.

తిప్పతీగను ఇంగ్లిష్‌లో గిలోయ్ అని, సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. ఇది మన ఇంటి పరిసరాల్లో, చుట్టు పక్కల పెరుగుతుంది కానీ దీని గురించి చాలా మందికి అవగాహన లేదు.

తిప్పతీగను ఎక్కువగా ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. మరి తిప్పతీగ వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవీ ‘తిప్పతీగ’ ప్రయోజనాలు…

తిప్పతీగ ఆకుల చూర్ణాన్ని నిత్యం తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు, ఇతర వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.

తిప్పతీగలో ఉండే యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ గుణాలు మన శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి.

దగ్గు, జలుబు, టాన్సిల్స్ తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని రోజూ సేవించడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. 

ఒక గ్లాసు గోరు వెచ్చని పాలలో కొద్దిగా తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి రోజూ రెండు పూటలా తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి.

తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకుని నిత్యం తింటే అజీర్తి తగ్గుతుంది. దీంతోపాటు మన జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

ఇక డయాబెటిస్.. అంటే మధుమేహ వ్యాధి ఉన్న వారు తిప్పతీగ చూర్ణాన్ని నిత్యం ఉదయం, సాయంత్రం తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను దీని ద్వారా తగ్గించుకోవచ్చు.

నిత్యం ఒత్తిడి, మానసిక ఆందోళనలతో సతమతం అయ్యేవారు తిప్పతీగ చూర్ణాన్ని రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

మరిన్ని వార్తలు

ఆహా! ఏమి రుచి: పనస పండు తిన్నారంటే వదలరు.. పైగా ఎన్నో ప్రయోజనాలు కూడా…
కడుపారా బ్రేక్‌ఫాస్ట్‌.. గుండె జబ్బులు బలాదూర్!
కల్పవృక్షం.. మునగ చెట్టు!
‘ట్రాన్స్‌ఫ్యాట్స్’ ప్రమాదకరం! జాగ్రత్త.. వీటికి దూరంగా ఉంటేనే శ్రేయస్కరం..
థైరాయిడ్ సమస్య నుంచి బయటపడాలంటే.. ఏం చేయాలో తెలుసా?
పొట్ట ఎక్కువగా ఉందా? విటమిన్ డి లోపం ఉన్నట్లే!
వేసవిలో సబ్జాగింజలతో కలిగే లాభాలేమిటో తెలుసా?
 
- Advertisement -