హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన మనసు, శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దీనికోసం మంచి పోషకాలనిచ్చే ఆహారం అవసరం అవుతుంది.
తాజా పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయి. ఏ కాలంలో వచ్చే పండ్లను ఆ కాలంలో తినాలి. అప్పుడే మన జిహ్వ చాపల్యమూ తీరుతుంది. మన శరీరానికి అవసరమైన పోషకాలూ లభ్యమవుతాయి.
పనసపండు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులోని ఎన్నో పోషక విలువలు మనకి అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అవేంటో చూద్దాం.
పనస పండులో విటమిన్ ఎ, సి, బి6 మాత్రమే కాక, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్ ఉంటాయి.
ఇందులోని విటమిన్ ఎ.. కంటి చూపుని మెరుగుపరచడమే కాక, చర్మం, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంలో కూడా పనస పండు ఎంతగానో తోడ్పడుతుంది.
ఈ పండ్లలోని కొన్ని ప్రత్యేక గుణాలు కాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బుల నుంచి కూడా మనల్ని కాపాడతాయి. పేగు క్యాన్సర్, లంగ్ కాన్సర్‌కు కారణమయ్యే కారకాలతో పోరాడడంలో పనస పండు ఎంతగానో సహాయపడుతుంది.
ఇక జీర్ణ సంబంధిత సమస్యల నుంచి విముక్తి కలిగించడంలోనూ పనసపండు ఎంతో ఉపయోగపడుతుంది. మధుమేహ(డయాబెటిస్) వ్యాధిగ్రస్తులు ఈ పండు తినడం వల్ల వారికి ఇన్సులిన్ తీసుకున్నంత ప్రయోజనం కలుగుతుంది.
అంతేకాదు, పనసతొనలు తినడం ద్వారా పురుషులలో వీర్యకణాలు కూడా వృద్ధి చెందుతాయి. ఈ పండు తిన్నాక పురుషులు శృంగారంలో రెచ్చిపోతారని కూడా నిపుణులు చెబుతున్నారు.