షాకింగ్: 40 నిమిషాలు నిలిచిపోయిన యూట్యూబ్! ఏం జరిగిందంటే…

- Advertisement -

 

వాషింగ్టన్: వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌ యూట్యూబ్‌ అకస్మాత్తుగా ఆగిపోయింది.  అవును.. దీనికి సాంకేతిక సమస్యలే కారణమని చెబుతున్నారు. మంగళవారం దాదాపు 40 నిమిషాలపాటు యూట్యూబ్ నిలిచిపోవడంతో నెటిజన్లు ఇబ్బంది పడ్డారు. అంతేకాదు, ఉన్నట్లుండి యూట్యూబ్‌, యూట్యూబ్‌ టీవీ, యూట్యూబ్‌ మ్యూజిక్‌లో తలెత్తిన సమస్యలను తమ ట్వీట్స్ ద్వారా ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై యూట్యూబ్ కూడా స్పందించింది.  నెటిజన్లకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలో ఈ సమస్యను పరిష్కరించి, అప్‌డేట్‌ చేస్తామని యూట్యూబ్‌ సంస్థ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది.

యూట్యూబ్‌ కంటెంట్‌ చూడాలని వెబ్‌సైట్‌లోకి వెళ్తే 500 ఇంటర్నల్‌ సర్వర్‌ ఎర్రర్‌, 503 నెట్‌వర్క్‌ ఎర్రర్‌ అని వస్తోందంటూ నెటిజన్లు వాటికి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను కూడా ట్విటర్‌లో షేర్‌ చేస్తున్నారు. అలాగే వెబ్‌సైట్‌లోకి  లాగిన్‌ కావడం లేదని కూడా పేర్కొన్నారు.

గత నెలలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో ఇలాగే క్రాష్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూట్యూబ్ వంతు అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -