విడ్డూరం: విమానం మిస్సయిందని.. దాని వెనుక పరుగెత్తిన మహిళ…

woman tried it chase down a moving plane after she missed it in bali
- Advertisement -

woman tried it chase down a moving plane after she missed it in bali

బాలి: మనం ఎక్క వలసిన బస్సు లేదా రైలో మిస్ అయితే ఏం చేస్తాం? అప్పుడే స్టార్ట్ అయితే వెనుకాల పరుగెత్తి దాన్ని ఎక్కే ప్రయత్నం చేస్తాం. లేదంటే మరో దాని కోసం వేచి చూస్తాం. మరి విమానం మిస్ అయితే.. ఆ విమానం వెనుకాల పరుగెత్తి దాన్ని ఎక్కడానికి ప్రయత్నించే వాళ్లను ఎప్పుడైనా చూశారా?

ఇండోనేషియాలోని బాలిలో ఉన్న ఎన్‌గురా రాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి వింత సంఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… హనా అనే మహిళ బాలి నుంచి జకార్తాకు విమానంలో ప్రయణం చేయాల్సి ఉంది. అయితే ఆమె కాస్త ఆలస్యంగా ఎయిర్‌పోర్ట్‌కు రావడంతో అప్పటికే విమానం కదిలింది.

నిజానికి ఎయిర్ పోర్ట్ సిబ్బంది మూడుసార్లు ఆమెకు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదని ఎయిర్‌పోర్ట్ అధికారులు చెప్పారు. తీరా విమానం కదలడానికి పది నిమిషాల ముందు బోర్డింగ్ గేట్ దగ్గరున్న సెక్యూరిటీని తప్పించుకొని ఆమె రన్‌వేపై ఉన్న విమానం దగ్గరకు దూసుకెళ్లే ప్రయత్నం చేసింది.

అలాగే కదులుతున్న విమానం దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న ఇద్దరు సెక్యూరిటీ అధికారులు ఆమెను పట్టుకున్నారు.  అయితే అప్పటికి ఆ విమానం మిస్ అయినా.. చివరికి ఆమెను జాగ్రతగా మరో విమానంలో జకార్తా పంపించారట ఎయిర్‌పోర్ట్ అధికారులు.

- Advertisement -