ఫరీదాబాద్: ఏడుగురు వ్యక్తులను అతి కిరాతకంగా హత్య చేసి ఫరీదాబాద్ పరిసరి ప్రాంతాల ప్రజలకు నిద్ర లేకుండా చేసిన సీరియల్ కిల్లర్‌ని హర్యానా పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన జగ్తార్ సిన్హా కొంతకాలంగా పలు ప్రాంతాల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడడమే కాకుండా వరసగా ఏడుగురిని అతి దారుణంగా హత్య చేశాడు.
చాలా కాలంగా జగ్తార్ సిన్హా కోసం పోలీసులు గాలిస్తుండగా, అనూహ్యంగా వారి చేతికి చిక్కాడు. పోలీసుల విచారణలో తన తప్పులను అంగీకరించిన జగ్తార్ సిన్హా… కొన్ని అసక్తికరమైన విషయాలను తెలిపాడు. ఆ విషయాలు విని పోలీసులే షాకయ్యారు.
జగ్తార్ సిన్హా హత్య చేయడానికి ముందు కచ్చితంగా పూజ చేస్తాడట. పూజ తర్వాత హత్యకు పథకం పన్నుతానని అతను పోలీసుల విచారణలో అంగీకరించాడు.
హత్యకు ముందు కాళీమాతకు పూజలు…
జగ్తార్ సిన్హా ఇప్పటి వరకు ఏడు మందిని అతి దారుణంగా హత్య చేయగా.. ప్రతి హత్యకు ముందు అతడు కాళీమాతకు పూజలు చేశాడట. తాను హత్య చేయబోతున్నానని.. తాను చేసే పాపం నుంచి ప్రాయశ్చితం కలిగించాలని అతడు కాళీమాతను కోరుకుంటాడట. అంతేకాదు.. కాళీమాతకు 108 మంత్రాలతో పూజలు, జపాలు కూడా చేస్తాడట.
ఫరీదాబాద్, పల్వాల్, కురక్షేత్ర, పంజాబ్ తదితర ప్రాంతాల్లో ఈ ఏడు హత్యలు చేసినట్లు నిందితుడు జగ్తార్ సిన్హా.. పోలీసుల ముందు అగీకరించాడు. దీంతో అతని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.