

జకార్తా: ఇండోనేషియాపై శనివారం రాత్రి వాల్కనో సునామీ విరుచుకుపడింది. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ ఉపద్రవం దెబ్బకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఆ దేశ విపత్తుల నిర్వహణ సంస్థకు చెందిన అధికారులు తెలిపారు.
దక్షిణ సుమ్రతా, పశ్చిమ జావాలోని బీచ్‌లను సునామీ తాకిన ఘటనలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వాల్కనో సునామీకి దాదాపు 222 మంది బలైపోయినట్లు, 600 మందికిపైగా గాయపడినట్లు, మరో 800 మంది గల్లంతైనట్లు తాజా సమాచారం చెబుతోంది.
క్రకటోవా అగ్నిపర్వతం బద్ధలు కావడంతో ఆ ధాటికి కొండ చరియలు విరిగి సముద్రంలో పడి అలజడి చోటుచేసుకోవడమే ఈ సునామీకి కారణమై ఉండొచచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఉపద్రవం కారణంగా 43 ఇళ్లు, 9 హోటళ్లు, లెక్కపెట్టలేని సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయని, వాహనాలు కొట్టుకుపోయాయని తెలిపారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం…
ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్, దక్షిణ లాంపంగ్ ప్రాంతాల్లోని బీచ్‌లలో సునామీ ప్రభావం అధికంగా కనిపించింది. మృతుల్లో అత్యధికులు విదేశీ పర్యాటకులేనని సమాచారం. గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇండోనేషియాకు సునామీలు, భూకంపాలు కొత్తేమీ కాదు. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ కారణంగా 13 దేశాల్లో రెండు లక్షల 26 వేల మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఒక్క ఇండోనేషియాకు చెందిన ప్రజలే లక్షా 20 వేల మంది ఉండటం గమనార్హం.
ఇక 1883లో క్రకటోవా అగ్నిపర్వతం వల్ల సంభవించిన సునామీల కారణంగా ఇండోనేషియాలో 36 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. 1927 తరువాత ఈ క్రకటోవా అగ్నిపర్వతం కారణంగా సునామీ సంభవించడం ఇదే తొలిసారి.
ఇండోనేషియాలోని లోంబోక్, సులావేసి, జావా ద్వీపాలకే పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. విపత్తులు కూడా ఎక్కువగా ఈ దీవుల్లోనే సంభవిస్తున్నాయి. తాజాగా సంభవించిన సునామీ కూడా జావా, సుమత్ర దీవుల్లో తన ప్రతాపాన్ని చూపించింది.
బాంటెన్ ప్రావిన్సులోని తాంజుంగ్ తెసుంగ్‌లో ఔట్ డోర్ స్టేజ్‌పై పెర్ఫార్మ్ చేస్తోన్న రాక్ బ్యాండ్‌పై సునామీ విరుచుకుపడింది. తాంజుంగ్ తెసుంగ్‌ను టూరిజంకు గేట్‌వేగా చెబుతారు. ఈ ప్రమాదంలో ఒక మ్యూజీషియన్ మరణించగా, మరికొందరు గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు.
A terrible scene of the tsunami that hits the concert of Seventeen Band in southern Lampung caused by the eruption of the Anak Krakatau.
December 22, 2018
Prayers and thoughts to the people affected ???#krakatau #indonesia #tsunami #krakatoa #volcano #IndonesiaTsunami pic.twitter.com/vERWSOvDTM
— Buitengebieden (@buitengebieden) December 23, 2018
Finally managed to leave #Anyer now inland on the way with car to #Jakarta Seems like the Indonesian authorities is doing a great job dealing with the situation on the ground. Hopefully people affacted on the coast get their assistance @DivHumas_Polri @BNPB_Indonesia pic.twitter.com/g4H4teZe7t
— Øystein L. Andersen (@OysteinLAnderse) December 23, 2018








