
- Advertisement -
న్యూయార్క్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తొలిసారి నాలుగేళ్ల పులికి సోకింది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిందీ ఘటన.
అమెరికన్ ఫెడరల్ అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. నగరంలోని బ్రోంక్స్ జూలో నాలుగేళ్ల పులి నాడియాకు జూపార్క్ ఉద్యోగి నుంచి పులికి సోకినట్టు తెలిపారు.
ఇదే జూలో ఉన్న మరో ఆరు పులులు, సింహాలు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. ప్రస్తుతం నాడియా కోలుకుందని పేర్కొన్నారు.
దీంతో అప్రమత్తమైన అధికారులు గత నెల 16న జూను మూసివేశారు. జంతువుల్లోనూ వైరస్ ప్రబలడంతో కొత్త సమస్య తలెత్తినట్టు అయిందని జూపార్క్ డైరెక్టర్ జిమ్ బ్రెహేనీ తెలిపారు.
ప్రస్తుతం నాడియాను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -








