
హ్యూస్టన్: భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా గడ్డపై నుంచి ఉగ్రవాదులపై యుద్ధం ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పని చేస్తామని ఆయన ఉద్ఘాటించారు.
భారత్‌ను అస్థిర పరిచేందుకు పొరుగుదేశం కుట్రలు పన్నుతోందంటూ పాకిస్థాన్‌పై మోడీ విరుచుకుపడ్డారు. అమెరికాపై జరిగిన సెప్టెంబర్ 11 దాడులు, ముంబైపై జరిగిన నవంబర్ 26 దాడులకు సూత్రధారులు పొరుగుదేశంలో ఉన్నారని ఆరోపించారు.
ట్రంప్‌పై పొగడ్తల వర్షం…
72 ఏళ్లుగా భారత్‌ను ఇబ్బంది పెట్టిన ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధికి బాటలు వేశామని మోడీ చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం కురిపించారు.
‘అబ్ కీ బార్.. ట్రంప్ సర్కార్’ (ట్రంప్ మళ్లీ అధికారంలోకి రావాలి) అంటూ హ్యూస్టన్ వేదికగా మోడీ పిలుపునిచ్చారు. ట్రంప్ భారత్‌కు నిజమైన స్నేహితుడని, హ్యూస్టన్ నుంచి ఈ కొత్త స్నేహగీతం కొనసాగుతుందన్నారు.
అత్యంత బలమైన ప్రభుత్వం…
60 ఏళ్ల తర్వాత భారత్‌లో అత్యంత బలమైన ప్రభుత్వం ఏర్పడిందని మోడీ అన్నారు. ఇదంతా మోడీ ప్రతిభ వల్ల జరిగింది కాదని.. భారతీయుల సంకల్పం వల్లే జరిగిందని స్పష్టం చేశారు.
సంకల్పం నుంచి సాకారం వరకు… ఇదే భారత్ కొత్త నినాదం అని చెప్పారు. బీజేపీ హయాంలో దేశవ్యాప్తంగా జరిగిన అభివృద్ధిని హ్యూస్టన్ వేదికగా మోడీ ప్రస్తావించారు.
97 శాతం గ్రామాలకు ఐదేళ్లలో రోడ్లు వేశామని… ఐదేళ్లలో 2 లక్షల కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు నిర్మించామన్నారు. గత ఐదేళ్లలో వందశాతం ప్రజలను బ్యాంకులకు అనుసంధానం చేశామని… 37 కోట్ల మందితో కొత్త బ్యాంకు ఖాతాలు తెరిపించామని మోదీ వివరించారు.
You all have set the stage for a glorious future as far as India-USA ties are concerned. I thank you all: PM @narendramodi tells the Indian community in Houston pic.twitter.com/megDbMAiHp
— PMO India (@PMOIndia) September 22, 2019
USA all set to welcome PM Modi.
This the power of India ?#HowdyModi pic.twitter.com/lLt9mse7um— स्वतंत्र (@ianujagnihotri) September 22, 2019








