26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం షాకింగ్: గౌను పైకెత్తేసి చూసుకోండి అని చెప్పిన యువతి! అసలేం జరిగిందంటే…

షాకింగ్: గౌను పైకెత్తేసి చూసుకోండి అని చెప్పిన యువతి! అసలేం జరిగిందంటే…

dress removed by girl
- Advertisement -

రష్యా: రష్యాలో ఒక యువతి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బాగా రద్దీగా ఉండే ప్రదేశంలో సదరు యువతి తన దుస్తులను పైకి ఎత్తి లోదుస్తులు కనిపించేలా ఒక వీడియోని తీసి అందరికీ షేర్ చేసింది. ఈ ఘటన సెయింట్ పీటర్స్‌బర్గ్ సబ్‌వేలో జరిగింది.

సాధారణంగా స్త్రీలు కురచ దుస్తులు ధరించినప్పుడు, వారికి తెలియకుండా కొంతమంది ఆకతాయిలు వారి ఫోటోలు తీసే క్రమంలో పొరపాటున కనిపిస్తున్న వారి లోదుస్తులపై ఫోకస్ పెట్టడం రష్యాలో ఓ జాడ్యంలా మారింది.

లోదుస్తులు కనిపించేలా…

అలాంటి వక్ర దృష్టితో చూసేవారికి బుద్ధి చెప్పాలనుకున్న రష్యన్ విద్యార్థిని అన్నా డోవ్‌‌గల్‌యుక్ సెయింట్ పీటర్స్‌బర్గ్ సబ్‌వేలో తన నిరసన తెలిపేందుకు అప్‌స్కర్టింగ్ అని పిలవబడే నిరసనలో భాగంగా తన ఎర్రటి పైదుస్తులను రెండు చేతులతో పైకి ఎత్తి లోదుస్తులు కనిపించేలా కెమెరా ముందు నిలుచుంది.

ఈ వీడియోని స్కర్ట్‌ల కింద ఏముంది అని చూసే వారందరికీ అంకితం అంటూనే, అలాంటి వాళ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ఎందరో స్త్రీల తరపున తాను అలా నిల్చున్నట్లు, తనలాంటి వారి నుండి దూరంగా ఉండాలంటూ పేర్కొంది. ఇలాంటి ఉదాహరణ ద్వారా అయినా అప్‌స్కర్టింగ్‌ని నేరంగా పరిగణించాలంటూ అధికారులను కోరుకుంటోంది.

చదవండి: భలే ఉద్యోగం: 19 ఏళ్లకే హ్యాకింగ్ ద్వారా రూ.కోట్లు సంపాదిస్తోన్న యువకుడు!

- Advertisement -