భలే ఉద్యోగం: 19 ఏళ్లకే హ్యాకింగ్ ద్వారా రూ.కోట్లు సంపాదిస్తోన్న యువకుడు!

ethical-hacking, Newsxpressonline
- Advertisement -

అర్జెంటీనా: ఓ యువకుడు 19 ఏళ్ల వయసులోనే లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంతకీ అతడు చేస్తున్న ఉద్యోగం ఏమిటో తెలుసా? బగ్ బౌంటీ హంటర్. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే.. హ్యాంకింగ్! అవును, ఎథికల్ హ్యాకింగ్ ద్వారా పలు సంస్థలకు చెందిన వెబ్ సైట్లలో లోపాలు కనిపెట్టి వాటిని ఆయా సంస్థలకు తెలుపుతూ చట్టబద్ధంగానే లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడు.

అర్జెంటీనాకు చెందిన శాంటియాగో లోపెజ్ ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగినవిగా భావించే వెబ్‌సైట్లలో కూడా బగ్స్ కనుగొంటూ ఉంటాడు. ఇప్పటి వరకు ఇలా 1600కుపైగా బగ్స్‌ అతడు గుర్తించి ఆయా వెబ్ సైట్లకు చెందిన సంస్థలను అతడు హెచ్చరించాడు కూడా.

బిగ్ బౌంటీ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫామ్‌కు చెందిన హ్యాకర్ వన్‌లో 2015లో చేరిన శాంటియాగో లోపెజ్.. ఇప్పటి వరకు వెరిజాన్ మీడియా కంపెనీ, ట్విట్టర్, వర్డ్ ప్రెస్, ఆటోమేటిక్ తదితర ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వెబ్ సైట్లలో దాదాపు 1670 వేర్వేరు బగ్‌లను కనిపెట్టాడు.

డబ్బు కోసమే హ్యాకింగ్…

హ్యాంకింగ్ మొదలెట్టిన తొలినాళ్లలో శాంటియాగో లోపెజ్ డబ్బు కోసమే ఆ పని చేసేవాడట. ‘‘అప్పట్లో ఏదో తెలియని కుతూహలం, డబ్బు సంపాదించాలనే కోరిక నన్ను ఆ పని చేయించింది.. అయితే బగ్ బౌంటీ నన్ను సరైన మార్గం(ఎథికల్ హ్యాకింగ్) లో పెట్టింది..’’ అంటూ చెబుతాడు లోపెజ్.

ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలన్నీ తమ అంతర్గత భద్రత కోసం ఇలాంటి లీగల్ హ్యాకర్ల మీద ఆధారపడుతున్నాయి. అందుకు ఎంత వేతనాన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఒక్కో వెబ్ సైట్‌లో బగ్ కనిపెట్టినప్పుడల్లా శాంటియాగోకు వేల డాలర్లు అభిస్తున్నాయి మరి.

- Advertisement -