26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం ఆశ్చర్యం: ‘మా అమ్మాయిని పెళ్లాడితే.. రూ.2 కోట్లు ఇస్తా’! సోషల్ మీడియాలో వైరల్‌…

ఆశ్చర్యం: ‘మా అమ్మాయిని పెళ్లాడితే.. రూ.2 కోట్లు ఇస్తా’! సోషల్ మీడియాలో వైరల్‌…

Our daughter is married .. Young people in surprise!
- Advertisement -

బ్యాంకాక్: పాతికేళ్లొచ్చిన కుర్రాళ్లంతా తమ పెళ్లి కోసం కలలు కంటుంటారు. అలాంటి వారిని ఊరించే వార్తొకటి సోషల్‌ మీడియాలో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. థాయ్‌లాండ్‌కి చెందిన ఆర్నాన్ రోడాంగ్ అనే ఓ మిలియనీర్ వ్యాపారి చేసిన ప్రకటన అది.

ఇంతకీ ఏం ప్రకటించాడో తెలుసా? ‘నా కూతురికి 26ఏళ్లు. తనకు బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఇప్పటి వరకూ చూసిన అబ్బాయిల్లో ఎవరూ తనకు నచ్చలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నా కూతుర్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారికి రెండు కోట్ల రూపాయలు బహుమానంగా ఇస్తా. నా వ్యాపారంలో వాటా ఇస్తా’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

ఆస్తిలో వాటా…

ఇది చూసిన చాలా మంది ముందు షాకయ్యారు. అబ్బాయి ఎంత వరకు చదువుకున్నా పర్లేదని, కష్టించి పనిచేసే తత్వం ఉంటే చాలని చెప్పాడు. ఆసక్తి గలవారు ఏ దేశం వారైనా పర్వాలేదని, తనను సంప్రదించాలని కోరాడు. వారిలో తన కూతురికి నచ్చిన వారిని తన అల్లుణ్ణి చేసుకొని రెండుకోట్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. స్నేహితురాళ్ల ద్వారా విషయం తెలుసుకున్న ఆర్నాన్ కూతురు కర్నిస్టా నవ్వేసింది.

తనకు కూడా కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తే భర్తగా కావాలని, అయితే ఆ రెండుకోట్లు తన దగ్గర్నుంచి తీసుకోవడం సులభం కాదని నవ్వుతూ హెచ్చరించింది. భారతదేశంలోలా థాయ్‌లాండ్‌లో వరకట్నం విధానం లేదు. ఇప్పటికీ కన్యాశుల్కం పద్ధతినే అనుసరిస్తారక్కడ.

- Advertisement -