
ప్యాంగ్‌యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆయనకు ఇటీవల హృదయ సంబంధ శస్త్ర చికిత్స జరిగిందని, ఆ తరువాత ఆరోగ్యం క్షీణించినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ పేర్కొంది. కిమ్ ప్రస్తుత ఆరోగ్య స్థితి గురించి అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి ద్వారా ఈ మేరకు తాము సమాచారం సేకరించినట్లు ఆ మీడియా సంస్థ పేర్కొంది.
చదవండి: ఐపీఎల్ రద్దు అయిందో.. రూ. 5 వేల కోట్లు మునిగినట్టే!
ఈ నెల 15వ తేదీన ఉత్తర కొరియా వ్యవస్థాపక దినోత్సవం. ఆరోజున ఉత్తర కొరియా వ్యవస్థాపకుడైన కిమ్ తాత.. కిమ్ II సంగ్ జయంతి వేడుకలు కూడా నిర్వహిస్తారు.
ఏటా ఈ కార్యక్రమానికి హాజరయ్యే కిమ్ జోంగ్ ఉన్.. ఈ ఏడాది కార్యక్రమానికి హాజరుకాకపోవడం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం. దీంతో నిజంగానే కిమ్ అనారోగ్యానికి గురై ఉంటారని, రహస్యంగా చికిత్స చేస్తూ ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు.
అన్నీ పుకార్లే: కొట్టిపారేస్తోన్న ఉత్తరకొరియా
అయితే ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై వస్తోన్న పుకార్లను, కథనాలను ఆ దేశం తోసిపుచ్చింది.
కిమ్ ఈ ఏడాది సగటున వారానికి ఒక కార్యక్రమం చొప్పున ఇప్పటి వరకు 17 అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొంటోంది.
చదవండి: కరోనా ఎఫెక్ట్: ట్రంప్ తాజా నిర్ణయం.. భారతీయులపై తీవ్ర ప్రభావం, అదే గనుక జరిగితే…
వ్యవస్థాపక దినోత్సవానికి హాజరుకానంత మాత్రాన ఆయన అనారోగ్యానికి గురై ఉండొచ్చంటూ ఊహాగానాలు చేయడం సమంజసం కాదంటూ ప్ర్రకటించింది.
అయితే దక్షిణ కొరియాకు చెందిన ఓ మీడియా సంస్థ మాత్రం కిమ్ అనారోగ్యం, ఆయనకు హృదయ సంబంధ శస్త్ర చికిత్స జరిగడం అన్నీ నిజమేనని, కాకపోతే ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వెల్లడించింది.








