ఇంకా ఎంతకాలం ఆ ముసుగు: భారత్‌పై అమెరికా అధ్యక్షుడి తీవ్ర వ్యాఖ్యలు…

donald-trump
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా, చైనాలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియా అభివృద్ధి చెందిన దేశమేనని, అభివృద్ధి చెందుతున్న దేశమనే ముసుగులో ఇంకా తమను మోసం చేయలేరని వ్యాఖ్యానించారు.

వర్ధమాన దేశాల జాబితా ముసుగులో భారత్, చైనాలు పెద్ద దేశాల నుంచి లాభాలను పొందుతున్నాయని, ఇకపై దీనిని సాగనివ్వబోమని అన్నారు. ఆసియా ఖండంలో ఈ రెండు దేశాలూ ఆర్థిక దిగ్గజాలుగా మారాయని, ఇకపై వాటికి వర్ధమాన దేశాలన్న ట్యాగ్ ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు.

ఆ ట్యాగ్‌తో ఇక మోసం చేయలేరు…

ఇండియా, చైనాలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఎన్నో ఏళ్లుగా అమెరికా ఆర్థిక ప్రయోజనాలను వాటికి దగ్గర చేస్తూ వచ్చిందని, అయితే వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఈ రకమైన ట్యాగ్‌తో అవి అమెరికాను నష్టపరుస్తున్నాయంటూ ట్రంప్ ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఒక్క అమెరికా తప్ప అన్ని దేశాలూ ఎదుగుతున్నాయని, వర్ధమాన దేశాలనే హోదాను వాడుకుంటూ, అక్రమంగా ప్రయోజనాలు పొందుతున్న దేశాలను ఇక మీదట ఉపేక్షించేది లేదని, తాము అడ్డుకుని తీరుతామని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -