

వాషింగ్టన్: గూగుల్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో ఉన్న ఈజీ యూనివర్సల్ టీవీ రిమోట్ అనే యాప్ సహా 85 ప్రమాదకరమైన యాప్‌లను తొలగిస్తున్నట్లు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తెలిపింది.
తన అండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో ఉన్న కొన్ని గేమ్, టీవీ అండ్ రిమోట్ కంట్రోల్ సిమ్యులేటర్ వంటి యాప్‌ల ద్వారా వినియోగదారుల డేటా చోరీకి గుర్యే అవకాశం ఉందని, అందుకే ఆయా యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నామని పేర్కొంది. ఇలా హానికారక యాప్‌లను తొలగించడం గూగుల్‌కు కొత్తేం కాదు, గత ఏడాది నవంబర్‌లో 13 యాప్‌లు, డిసెంబర్‌లో మరో 22 ప్రమాదకర యాప్‌లను తొలగించింది.
ఈ హానికారక యాప్‌లను తొలుత గుర్తించింది ట్రెండ్ మైక్రో అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ. ఈ కంపెనీ కథనం ప్రకారం.. కొన్ని యాప్‌లు ఫుల్ స్క్రీన్ యాడ్స్‌ను డిస్‌ప్లే చేస్తూ.. మొబైల్ లేదా ఇతర డివైజ్‌ల స్క్రీన్ అన్‌లాకింగ్ పనితీరును గమనిస్తూ డేటా చోరీకి పాల్పడుతున్నాయి.
ఇలాంటి యాప్‌లు చాలా ప్రమాదకరం.. మొబైల్ వినియోగదారుల కీలక సమాచారం వీటి ద్వారా సులువుగా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే ఇలా డేటా చోరీ చేస్తోన్న ‘ఈజీ యూనివర్స్ టీవీ రిమోట్’ అనే యాప్‌ను మొబైల్ వినియోగదారులు 50 లక్షలసార్లు డౌన్లోడ్ చేశారు. ఇలాంటి 85 ప్రమాదకర యాప్‌లు కూడా 9 మిలియన్లసార్లు డౌన్లోడ్ చేయబడ్డాయి.
ఈ యాప్‌లను ఓపెన్ చేసిన ప్రతిసారీ ఫుల్ స్క్రీన్ యాడ్ డిస్‌స్లే అవుతుంది. దాన్నుంచి బయటికి వచ్చేందుకు వరుసగా వివిధ రకాల బటన్స్ నొక్కమంటూ అప్షన్స్ వస్తూనే ఉంటాయి. స్క్రీన్‌పై కనిపించే వివరాలు ఫాలో అవుతూ కీబోర్డుపై నొక్కినా ప్రతిసారీ సదరు వినియోగదారుల మొబైల్‌కు చెందిన వివరాలు ఆయా వెబ్ పేజీల్లోకి వెళ్లిపోతుంటాయి.
ఆ యాప్ క్రాష్ అయ్యేంత వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. అదే సమయంలో ఫోన్ లాక్ ప్యాట్రన్ సహా ఫోన్‌లోని ఇతర కీలక సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది.
మరికొన్ని ప్రమాదకర యాప్‌లు ఇవే…
స్పోర్ట్ టీవీ, ప్రాడో పార్కింగ్ సిములేటర్ 3డీ, టీవీ వరల్డ్, సిటీ ఎక్స్‌స్ట్రీమ్‌పోలీస్, అమెరికన్ మజిల్ కార్, ఐడిల్ డ్రిప్ట్, టీవీ రిమోట్, ఏసీ రిమోట్, బస్ డ్రైవర్, లవ్ స్టిక్కర్స్, క్రిస్‌మస్ స్టిక్కర్స్, పార్కింగ్ గేమ్, బ్రెజిల్ టీవీ, వరల్డ్ టీవీ, ప్రాడో కార్, చాలెంజ్ కార్ స్టంట్స్ గేమ్, యూకే టీవీ, ఫొటో ఎడిటర్ కొలేజ్ 1, మూవీ స్టిక్కర్స్, రేసింగ్ కార్ 3డీ, పోలీస్ చేజ్, ఫ్రాన్స్ టీవీ, చిలీ టీవీ, సౌతాఫ్రికా టీవీ..









Becareful about these Apps
Hi Friends Good Morning have a nice day