21.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం మరోసారి ఇండోనేషియాను వణికించిన భూకంపం….

మరోసారి ఇండోనేషియాను వణికించిన భూకంపం….

- Advertisement -

Indonesia-earthquake

జకార్తా: ఇండోనేషియాని మరోసారి భూకంపం అతలాకుతలం చేసింది. ఇటీవలే ‘సులవేసి’ ద్వీపంలో సంభవించిన భూకంపం, సునామీ ధాటికి మరుభూమిగా మరిన ఇండోనేషియాకి మరో దెబ్బ తగిలింది. ఇక్కడ 15 నిమిషాల వ్యవధిలో వరుసగా రెండుసార్లు భూకంపం  సంభవించింది.  మంగళవారం ఉదయం ‘సుంబా’ దీవిలో 15 నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులుదీశారు.

చదవండి: ఇండోనేషియాలో సునామీ బీభత్సం… 384 మంది మృత్యువాత…

మొదటగా ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో సంభవించింది. ఆ తర్వాత 15 నిమిషాల వ్యవధిలో రెండోసారి రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో భూమి కంపించినట్టు అమెరికా జియెలాజికల్ సర్వే తెలిపింది. ‘సులవేసి’కి దక్షిణాన 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘సుంబా’ దీవిలో దాదాపు 7.5 లక్షల మంది వరకు జనాభా నివసిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు శుక్రవారం ‘సులవేసి’ ద్వీపాన్ని అతలాకుతలం చేసిన సునామీ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే అధికారంగా 832 మంది మరణించినట్లు ప్రకటించినప్పటికీ అనధికారిక సమాచారం ప్రకారం ఈ సంఖ్య దాదాపు 1200 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ అపరేషన్ కొనసాగిస్తున్న రెడ్ క్రాస్ సిబ్బంది సిగి జిల్లాలో ఓ కూలిన చర్చి భవనం కింద దాదాపు 34 మంది విద్యార్ధుల మృత దేహాలను కనుగొన్నారు. దీంతో గల్లంతైన 52 మంది విద్యార్ధుల కోసం సిబ్బంది ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

- Advertisement -