25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం కరోనాను జయించిన బ్రిటన్ ప్రధాని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

కరోనాను జయించిన బ్రిటన్ ప్రధాని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

- Advertisement -

లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్(55)  కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బోరిస్ గత నెలలోనే కొరోనా వైరస్ బారిన పడ్డారు. హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. వారం రోజులపాటు చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు ఆయన లండన్ ఆసుపత్రిలో చేరారు. 

ఆసుపత్రి నుంచే ప్రజలకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘తాను బాగానే ఉన్నానని, కోలుకుని తిరిగి వస్తానని..’ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఆ తర్వాత ఆయన పరిస్థితి క్షీణించింది. దీంతో బోరిస్ జాన్సన్‌ను వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. 

3 రోజుల చికిత్స అనంతరం…

మూడు రోజులపాటు ఐసీయూలో చికిత్స తీసుకున్న ఆయనను నిన్న సాధారణ వార్డుకు తరలించారు. తాజాగా పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 

మరోవైపు బ్రిటన్ లో ఇప్పటివరకు 78,991 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 9,875 మంది మృతి చెందారు. కరోనా నేపథ్యంలో యూకేలోనూ లాక్‌డౌన్ కొనసాగుతోంది.

అయితే చాలామంది బ్రిటన్ వాసులు లాక్‌డౌన్‌ను పట్టించుకో్కుండా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఇళ్లు దాటి బయటకు రావొద్దని ప్రభుత్వం చేసిన హెచ్చరికలు పట్టించుకోకపోవడం వల్లే బ్రిటన్ లో అత్యధిక కరోనా కేసులు,మరణాల నమోదుకు కారణమైంది.

 
- Advertisement -