14 మంది అమ్మాయిలను ముగ్గులోకి దింపి.. కోమాలోకి వెళ్లిపోయాడు!

14girlfriends
- Advertisement -

14 Girlfriends

ఒక అమ్మాయిని ప్రేమలో పడేసి, ఆమెను మెయింటెయిన్ చేయడమే ఈ రోజుల్లో ఎంతో కష్టం. అలాంటిది ఓ 18 ఏళ్ల యువకుడు ఏకంగా 14 మంది అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం నడిపాడు. అది కూడా ఒకరికి తెలియకుండా మరొకరితో. అయితే, ఎంతో కాలం సాగలేదు అతడి ప్రేమాయణం. ప్రేమికుల దినోత్సవం రోజున అంతా కట్ట కట్టుకుని అతడి ఇంటికి రావడంతో.. వారందర్నీ చూసిన అతడు కోమాలోకి జారుకోవడం కొసమెరుపు.

వివరాల్లోకి వెళితే.. ఆ ప్రేమికుడి పేరు రకీబ్. 18 ఏళ్ల ఈ కుర్రాడు టైంపాస్‌ కోసం అమ్మాయిలకు వల వేసేవాడు. ఇలా ముందు ఒక అమ్మాయిని ముగ్గులోకి దింపాడు. ఆ తర్వాత ఆమెకు తెలియకుండా మరో అమ్మాయిని ట్రాప్ చేశాడు.

ఈ ఇద్దరికీ తెలియకుండా ఇంకో అమ్మాయిని.. ఇలా ఒకరికొకరికి తెలియకుండా 14 మంది అమ్మాయిలను తన ప్రేమ వలలో పడేశాడు. అతడిలో ఏం నచ్చిందో కానీ, ఆ అమ్మాయిలంతా అతడ్ని ప్రేమించారు.

ఫిబ్రవరి 14నే రోజునే..

ఈ క్రమంలో ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14 రానే వచ్చింది. ఇంకేముంది.. ఇక రకీబ్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా తన బాయ్ ఫ్రెండ్‌కు సర్‌ప్రైజ్ ఇద్దామని నేరుగా రకీబ్ ఇంటికొచ్చారు. ముందుగా ఓ అమ్మాయి వచ్చింది. ఆ తర్వాత మరో అమ్మాయి.. ఆ వెనకే ఇంకో అమ్మాయి.. ఇలా 14 మంది గోపికలు రకీబ్ ఇంటిముందు క్యూకట్టారు.

ఒకరినొకరు చూసుకుని షాక్‌కు గురయ్యారు. వారందర్నీ చూసి రకీబ్ మరింత అయోమయ పరిస్థితిలో పడిపోయాడు. తను ఐ లవ్ యూ చెప్పిన 14 మంది అమ్మాయిలను చూసి ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి. తాను ఇంతమందితో ప్రేమాయణం నడిపిన విషయం అందరికీ తెలిసిపోయిందని ఒక్కసారిగా భయాందోళనకు గురై కోమాలోకి వెళ్లిపోయాడు.

అయితే, వీరందరూ ఒకేసారి రావడానికి ఆ 14 మందిలోని జోరినా అనే అమ్మాయే కారణం కావడం గమనార్హం. రకీబ్ ఫోన్లో.. బేబీ గర్ల్ 1, 2..14 వరకు ఉండటంతో అనుమానం వచ్చి అందర్నీ పిలిపించానని జోరినా వెల్లడించింది. అయితే, తమను మోసం చేశాడని వారికి కోపం ఉన్నా.. కోమాలోకి వెళ్లడంతో రకీబ్ త్వరగా కోలుకోవాలని వారంతా ఆకాంక్షించడం గమనార్హం.

- Advertisement -