ఇక సినిమాలకు సమంత గుడ్ బై!?

samantha-akkineni
- Advertisement -

samantha-akkineni

హీరోయిన్‌ సమంత ఇక సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా షికార్లు కొడుతోంది.  కొన్నిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపను..’  అంటూ స్వయంగా చెప్పింది సమంత.   కానీ వచ్చే ఏడాది నుంచి మాత్రం ఆమె సినిమాలకు దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది.

సౌత్‌లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు.  హీరో నాగచైతన్యతో వివాహం అయ్యాక కూడా.. తన కెరీర్‌ను కొనసాగిస్తూ ఆమె మంచి హిట్లు అందుకున్నారు. ప్రస్తుతం తెలుగులో యూటర్న్‌ రీమేక్‌, తమిళంలో సెమ్మ రాజా, సూపర్‌ డీలక్స్‌ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. వీటితోపాటు ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివ నిర్వాణ డైరెక్షన్‌లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కించబోయే ఓ ప్రాజెక్టులోనూ  సమంత నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అయితే ఇకమీదట కొత్త ప్రాజెక్టులను సమంత ఒప్పుకోవటం లేదని, 2019 మార్చి కల్లా ఆయా ప్రాజెక్టులను పూర్తి చేసేసి.. తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్నారని అంటున్నారు. అయితే సమంత శాశ్వతంగా సినిమాలకు దూరం కానుందా? లేక ఆమె నిర్ణయం తాత్కాలికమా? ఈ విషయంలో క్లారిటీ లేదు.  మరి ఈ వార్త నిజమేనా? లేక కేవలం పుకారు మాత్రమేనా? అన్నది సమంత స్పందిస్తేనే తెలుస్తుంది.

- Advertisement -