25.6 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home క్రైమ్ దారుణం: భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్.. ఆ పైన ఏం చేశారంటే…

దారుణం: భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్.. ఆ పైన ఏం చేశారంటే…

woman-gang-rape-in-front-of-her-husband-in-alwar-district-of-rajasthan
- Advertisement -

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఓ ఘోరమైన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కొందరు దుర్మార్గులు ఓ వివాహితపై భర్త ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డారు. గత నెల 26వ తేదీన జరిగిన ఈ ఘటనపై బాధితులు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ దారుణం ఇప్పుడు బయటికొచ్చింది.

అసలేం జరిగిందంటే…

ఏప్రిల్ 26న రాజస్తాన్‌లోని లాల్వాడి గ్రామానికి చెందిన భార్యాభర్తలు తల్‌వృక్ష గ్రామానికి బైక్‌పై బయలుదేరారు. అయితే మధ్యాహ్నం 3గంటల సమయంలో వారు బైక్‌పై వెళ్తుండగా.. దారిలో ఐదుగురు దుర్మార్గులు అడ్డుపడ్డారు. ఇద్దరు ఆమె భర్తను గట్టిగా పట్టుకుని దారుణంగా కొట్టారు. అదే సమయంలో మిగిలిన ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

చదవండి: నటుడు కాదు ఉన్మాది… జ్యోతిష్యురాలిపై ఆత్యాచారం చేసి… ఆపై వీడియో తీసి..

తర్వాత ఆ ముగ్గురు భర్తని బంధించగా… మిగిలిన ఇద్దరు కూడా ఆమెపై అఘాయిత్యానికి ఒడికట్టారు. అదేకాకుండా అఘాయిత్యం మొత్తాన్ని వీడియో తీసి బెదిరించారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్తే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో ఘటన జరిగిన నాలుగు రోజులైనా ఆ దంపతులు కేసు పెట్టడానికి ధైర్యం చేయలేకపోయారు.

చివరికి ధైర్యం చేసి ఏప్రిల్ 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే దుండగులని పట్టుకుని కఠినంగా శిక్షించి బాధితులకి న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.

చదవండి: మరో మారుతీ రావు.. ఇంటికి పిలిపించి మరీ అల్లుడూ- కూతుళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించిన…

 

- Advertisement -