నటి ఝాన్సీ ఆత్మహత్య: ఆ వాట్సప్ చాట్‌లో ఏముందో? సెల్ఫీ వీడియో కలకలం!

telugu_TV_actress_Naga_Jhansi_with_Surya

jhansi

హైదరాబాద్: ప్రముఖ టీవీ నటీ ఝాన్సీ ఆత్మహత్య చేసుకోవడం, ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకోవటం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. శ్రీనగర్‌ కాలనీలోని తన నివాసంలో ప్యాన్‌కు ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

ఝాన్సీ అంతక్రియలు స్వగ్రామంలో జరుపుతామంటూ ఆమె బంధువులు మృతదేహాన్ని కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం వడాలికి తరలించారు.  టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న మధు అనే నటి విజయవాడకు చెందిన సూర్య తేజను ఝాన్సీకి పరిచయం చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

వీరిద్దరు కొంతకాలంగా ప్రేమించకుంటున్నారని, సూర్యతేజ వత్తిడితోనే సీరియల్స్ ను సైతం వదిలి పెట్టి, బ్యూటీ పార్లర్ నడుపుకోవాలనుకుందని, ఇప్పుడు పెళ్లికి సూర్య నిరాకరించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఝాన్సీ తల్లి అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేశారు.  మరోవైపు నిందితుడు సూర్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

పరారీలో సూర్య…

అయితే, తనకు.. ఝాన్సీ ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని సూర్యతేజ  ఫోన్‌లో కొంతమందితో సంభాషించినట్లు సమాచారం. ఝాన్సీని పెళ్లి చేసుకోవాలి అనుకున్న మాట వాస్తవమే కానీ, అమె అనేక మందితో సంబంధాలు పెట్టుకుందని.. దాని వల్లే తాను ఆమెకు దూరంగా ఉంటున్నానని నిందితుడు సూర్య చెపుతున్నాడు.

అయితే పోలీసులు సూర్యతేజను అరెస్ట్ చేసి పూర్తిగా విచారిస్తే కానీ అసలు ఝాన్సీ ఆత్మహత్యకు గల కారణాలు బయటపడే అవకాశం లేదంటున్నారు ఝూన్సీ బంధువులు.  మరోవైపు ఝూన్సీ ఉపయోగించిన సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె సూర్యతో చేసిన వాట్సప్ చాట్ ద్వారా మరిన్ని విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు.

అదీకాక తను చనిపోయే ముందు, ఆత్మహత్య చేసుకోవటానికి గల కారణాలు చెపుతూ సెల్ఫీ వీడియో తీసుకుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఝాన్సీ సెల్ఫీ వీడియోలో ఏం చెప్పిందో అన్నది ఇప్పుడు బుల్లితెర వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ప్రేమ వ్యవహారమే కారణమా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణం లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

బుల్లితెర వర్ధమాన నటి ఝాన్సీ ఆత్మహత్య! ప్రేమ వ్యవహారమే కారణమా?