దారుణం: పదహారేళ్ల అమ్మాయిపై 9 మంది అత్యాచారం.. అదీ రెండేళ్లుగా…

8:57 pm, Sun, 7 July 19
nine-men-rape-on-a-girl

కోయంబత్తూరు: కేరళలో దారుణం వెలుగు చూసింది. ఓ అమ్మాయి(16)పై 9 మంది వ్యక్తులు అత్యాచారానికి పాల్పడుతున్నారు.. అది కూడా దాదాపు రెండేళ్లుగా. ఈ కేసులో పొల్లాచి ఆల్ ఉమెన్ పోలీసులు శనివారం 8 మందిని అరెస్టు చేశారు. మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే…

పొల్లాచి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయి రెండేళ్ల వయసులోనే కన్నతల్లిని పోగొట్టుకుంది. ఆమె తండ్రి మరో మహిళను వివాహం చేసుకోవడంతో ఆ అమ్మాయి బాధ్యతను ఆమె అమ్మమ్మ తీసుకుంది. ఈ నేపథ్యంలో పదో తరగతి చదువుతూ ఆమె మధ్యలోనే ఆపేసింది.

తల్లిలేని పిల్లను మాయ చేసి…

పొల్లాచికి చెందిన ఎ.అమానుల్లా ఆమెతో తొలుత పరిచయం పెంచుకుని.. మాయమాటలు చెప్పి, బుజ్జగించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ తరువాత ఆమెను బెదిరించి.. తన మిత్రులతో కూడా ఆమె గడిపేలా చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించడంతో ఆ అమ్మాయి భయపడింది.

చదవండి: షాకింగ్: మొబైల్ షాపు యజమాని రాసలీలలు! మహిళా కస్టమర్ల అశ్లీల వీడియోలు తీసి…

అలా దాదాపు రెండేళ్లుగా అమానుల్లా అతడి మిత్రులు ఆమెపై అత్యాచారం చేస్తూ వస్తున్నారు. గురువారం కూడా అమానుల్లా ఆ అమ్మాయిని తనతో తీసుకెళ్లి తన మిత్రుడు భగవతితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తనను ఇంటి వద్ద దింపాలని బాధితురాలు ఎంత వేడుకున్నా వారు వినలేదు. పైగా వారి మరో మిత్రుడు ప్రభును కూడా ఆమెపై అత్యచారం చేయడానికి పిలిచారు. గురువారం అంతా ఆ అమ్మాయి కనిపించకుండా పోవడంతో శుక్రవారం ఆరా తీయగా ఆ అమ్మాయి తన బంధువులకు అసలు విషయాన్ని చెప్పేసింది. దీంతో వారు నేరుగా పొల్లాచి ఆల్ ఉమెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

9 మంది రెండేళ్లుగా…

దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివిధ ప్రాంతాల్లో తనపై తొమ్మిది మంది రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారని బాధిత బాలిక పోలీసులకు తెలిపింది. దీంతో ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. 9 మంది నిందితులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

శనివారం ఈ కేసులో పొల్లాచికి చెందిన ఎ అమానుల్లా(27), టి భగవతి అలియాస్ మొహమ్మద్ ఆసిఫ్, ఎ మొహమ్మద్ రఫీక్(28), జె సయ్యద్ ఇబ్రహీం(25), ఎ మొహమ్మద్ అలీ, కె డేవిడ్ అలియాస్ సెంథిల్ కుమార్(30), ఇర్షాద్ బాషా(28), మొహమ్మద్ ఖాన్ (44)లను అరెస్టు చేసిన పోలీసులు… తిరుపూర్‌కు చెందిన.. పరారీలో ఉన్న మరో నిందితుడు ఎన్ అరుణ్ నెహ్రూ(28) కోసం గాలిస్తున్నారు.