23.4 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home క్రైమ్ ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసింది: పిల్లల ముందే ఘోరం

ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసింది: పిల్లల ముందే ఘోరం

murder-husband
- Advertisement -

murder-husband

ఖమ్మం: వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తనే.. ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. ఆ తర్వాత సహజమరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం వెలుగులోకి రావడంతో బాధితుడి భార్య, ఆమె ప్రియుడు ఊసలు లెక్కబెడుతున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని వైరాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలూరుపాడుకు చెందిన షేక్‌ హమీదాను ఏడేళ్ల క్రితం వైరాకు చెందిన అబ్దుల్లా (27) వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అబ్దుల్లా స్థానికంగా ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయం సమీపంలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కాగా, ఇదే ప్రాంతానికి చెందిన షేక్‌ అక్బర్‌ (21)తో అబ్దుల్లా భార్య హమీదాకు కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది.

తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన అబ్దుల్లా మందలించాడు. అయినా వినకుండా అక్బర్‌తో తరుచూ ఫోన్‌ మాట్లాడుతుండటంతో పలుమార్లు హెచ్చరించాడు. తాను బయటకు వెళ్లిన సమయంలో తన ఇంటికి అక్బర్‌ వస్తున్నట్లు అబ్దుల్లాకు తెలిసింది. అంతేగాక, ఒకట్రెండు సార్లు అతడు దొంగచాటున ఇంట్లోంచి పారిపోయిన సందర్భాలను గమనించాడు. దీంతో మనస్తాపం చెందిన అతడు ఈ విషయాన్ని పెద్దల వద్ద చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు.

అక్బర్‌ను నియంత్రించేలా బంధువులకు చెప్పాలని కోరాడు. అయితే, ఆ తర్వాత కూడా హమీదా, అక్బర్‌ మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. దీంతో ఈ విషయంపై ఐదు రోజుల క్రితం అబ్దుల్లా, అక్బర్‌ మధ్య ఘర్షణ కూడా చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయాలపాలైన అబ్దుల్లా తనకు న్యాయం చేయాలని స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు మాత్రం అక్బర్‌ను మందలించి వదిలివేశారు.

సహజ మరణంగా చిత్రీకరించే యత్నం

ఈ నేపథ్యంలో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో అబ్దుల్లాను చంపేందుకు భార్య హమీదా, ప్రియుడు అక్బర్‌ పథకం పన్నారు. గురువారం అర్ధరాత్రి ఇంట్లో అబ్దుల్లా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అక్బర్‌ అక్కడకు చేరుకున్నాడు. అబ్దుల్లా మెడను పట్టుకున్న అక్బర్‌ గట్టిగా అదిమి ఊపిరి ఆడకుండా చేశాడు. ఆ సమయంలో అబ్దుల్లా కాళ్లను కదపకుండా భార్య హమీదా పట్టుకుంది. దీంతో అబ్దుల్లా ప్రాణాలు విడిచాడు.

ఆ తర్వాత అక్బర్‌ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తన భర్త మూర్ఛ కారణంగా చనిపోయినట్లు ఇరుగుపొరుగు, బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది హమీదా. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న ఏసీపీ ప్రసన్నకుమార్‌, సీఐ రమాకాంత్‌, ఎస్సై నరేశ్‌ అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. అబ్దుల్లా మృతిపై అనుమానాలు ఉండటంతో లోతుగా విచారించారు.

భార్యను, అక్బర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో తామే హత్య చేసినట్లు ఒప్పుకొన్నారు. అంతేగాక, అబ్దుల్లా కుమార్తె అయిన నాలుగేళ్ల సమీరా కూడా తన వాంగ్మూలాన్ని పోలీసులకు ఇచ్చింది. తన తండ్రిని అక్బర్ అంకులే చంపాడంటూ ఆ చిన్నారి పోలీసులకు తెలిపింది. తండ్రి హత్యకు గురికావడం, నిందితురాలైన తల్లి జైలుకు వెళ్లడంతో వారి పిల్లలు ఒంటరివారయ్యారు.

చదవండి: ఘోరం: తమ్ముడి కూతుర్ని చంపి.. రక్తం తాగిన మేనత్త! మరో ఘటనలో…

- Advertisement -