చండిగఢ్ : కళ్లు కప్పిన కామంతో ఓ తండ్రి కన్న కూతురిపాలిట కీచకుడు అయ్యాడు. అభంశుభం తెలియని ఆ మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కీచక తండ్రి అఘాయిత్యం కారణంగా ఆ అమాయకురాలు ఓ బిడ్డకు తల్లైంది.
చదవండి: షాకింగ్: మాజీ మహిళా ఎస్సైపై అత్యాచారం.. షెల్టర్ హోమ్‌లో దారుణం
సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన హర్యానా పంచుకుల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
పంచుకుల జిల్లాలోని సెక్టార్ 18 పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తి మానసిక వికలాంగురాలైన తన కూతురు(23)పై తరచూ లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఆమెకు తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది.
దీంతో కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ యువతి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, కుటుంబసభ్యుల్ని విచారించారు.
చదవండి: కరోనా వేళ కలకలం.. ప్రియుడితో కలిసి భర్తను లారీతో గుద్దించి చంపిన భార్య!
అయితే ఆ యువతి గర్భానికి గల కారణాలను ఆమె కుటుంబ సభ్యులు చెప్పలేకపోయారు. ఆమె తండ్రి ప్రవర్తన పోలీసులకు అనుమానాస్పందంగా అనిపించడంతో వారు అతడ్ని విచారించారు.
దీంతో అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఏడాది కాలంగా కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తెలిపాడు. దీంతో రేప్ కేసు నమోదు చేసి, పోలీసులు ఆ కామాంధుడిపై అరెస్ట్ చేశారు.