
- Advertisement -

విశాఖపట్నం: మూడు కిలోలకు పైగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విశాఖపట్నం రైల్వే స్టేషన్లో డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గౌహతి నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న రైలులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో డీఆర్ఐ అధికారులు సోదాలు చేశారు. 3.3కిలో బంగారాన్ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.
చొక్కాలో ప్రత్యేక జేబులు
స్వాధీనం చేసుకున్న బంగారం ధర సుమారు రూ.1.8కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు డీఆర్ఐ అదనపు డైరెక్టర్ ప్రసాద్ వివరించారు. మరింత సమాచారం కోసం నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కాగా, నిందితులు ఈ బంగారాన్ని చొక్కాలో ప్రత్యేకంగా కుట్టించిన జేబుల్లో దాచి తరలిస్తుండటం గమనార్హం.
- Advertisement -








