26.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home క్రైమ్ పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి: తాగొద్దన్నందుకు మద్యం మత్తులో భార్యను చంపేశాడు

పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి: తాగొద్దన్నందుకు మద్యం మత్తులో భార్యను చంపేశాడు

wifemurder
- Advertisement -

wife murder

హైదరాబాద్: వారిద్దరూ ఒకరినొకరు అమితంగా ప్రేమించుకున్నారు. అంతేగాక, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లైన కొద్ది నెలలకే తను ప్రేమించి, పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక తాగుబోతు అని ఆ యువతికి తెలిసింది. అప్పటికే ఆమె గర్భవతి. కాగా, మద్యానికి బానిసైన ఆ యువకుడు మద్యం మత్తులో ఆమెను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన నగరంలోని మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

మహాంకాళి ఏసీపీ వినోద్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్‌ మారేడుపల్లి, వాల్మీకినగర్‌కు చెందిన సన్ని బిడ్లాన్‌(30) స్థానికంగా నివసించే సత్యవతి(27)ని 2013, ఫిబ్రవరి 28న ఓ దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సన్ని వెస్ట్‌మారేడుపల్లి రోడ్డులోని శివం రైస్‌డిపో, కిరాణ దుకాణంలో పని చేస్తుండగా.. సత్యవతి ఇళ్లల్లో పనిమనిషగా చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

తాగొద్దన్నందుకు భార్యను చంపేశాడు

సత్యవతి, ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. కాగా, కొద్ది కాలంగా మద్యానికి బానిసైన సన్ని, తనకు డబ్బులు కావాలని నిత్యం సత్యవతితో గొడవపడేవాడు. ఈ క్రమంలో జనవరి 21వ తేదీ రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సన్నీకి సత్యవతిలకు వాగ్వాదం జరిగింది. తాగుడు మానుకోవాలన్న మాటలకు ఆవేశానికి గురైన సన్ని.. సత్యవతి గొంతునులిమి హతమార్చాడు. ఆ తర్వాత, ఇంటికి తాళం వేసి తాళంచెవిని ఆ పక్కనే పెట్టి సఫిల్‌గూడ ప్రాంతానికి వెళ్లిపోయాడు.

జనవరి 22న మల్కాజ్‌గిరిలో మద్యంతాగుతూ గడిపాడు. అదేరోజు రాత్రి 11గంటల సమయంలో ఇంటికి వెళ్లగా సన్నీకి తన తండ్రి సురేందర్‌ కనిపించడంతో ‘నీ కోడలిని చంపేశాను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆందోళనకు గురైన సురేందర్‌ ఆ విషయాన్ని స్థానికంగా నివసించే సత్యవతి తండ్రి చింతల రాములుకి చెప్పాడు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారొచ్చి తలుపులను తీసి చూసేసరికి సత్యవతి విగతజీవిగా పడివుంది. రాములు ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కాగా, గర్భవతి అయిన తనను సన్నీ కనీసం ఆస్పత్రికి కూడా తీసుకెళ్లడం లేదని హత్యకు కొద్దిగంటల ముందు తన కూతురు సత్యవతి తెలిపిందని, దీంతో ఆమెను ఆస్పత్రిలో పరీక్షలు చేయించానని, ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయిందని ఆమె తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు.

- Advertisement -