26 C
Hyderabad
Sunday, November 29, 2026
- Advertisement -
Home క్రైమ్ షాకింగ్: కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఒకరి తరువాత ఒకరు.. కారులోనే అత్యాచారం!

షాకింగ్: కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఒకరి తరువాత ఒకరు.. కారులోనే అత్యాచారం!

shurugwi-rape-scandals
- Advertisement -

raped, newsxpress.online

న్యూఢిల్లీ:  దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మరో మహిళపై అఘాయిత్యం చోటుచేసుకుంది. సహ ఉద్యోగినిపై కన్నేసిన ఇద్దరు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే… శనివారం సాయంత్రం ఆఫీసు ముగిసిన తర్వాత, ఇంటికి వెళ్ళేటప్పుడు, సహోద్యోగులు ఇద్దరు కారులో ఎక్కండి, మీ ఇంటి దగ్గర దింపుతాము అని నమ్మించారు.

సహోద్యోగులే నమ్మించి అత్యాచారం…

ఆమె కూడా సహోద్యోగులే కదా అని నమ్మి వారి కారులో ఎక్కింది. కొద్ది దూరం వెళ్తుండగా యువతికి కూల్ డ్రింక్ ఇచ్చారు. దాన్ని తీసుకున్న తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. ఆపై వారిద్దరూ వంతులేసుకుని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి వసంత్ కుంజ్ ప్రాంతంలో వదిలేశారు.

కొద్దిసేపటి తరువాత బాధితురాలి ఫిర్యాదుతో కేసును నమోదు చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసుపై విచారణను ముమ్మరం చేశామన్నారు. ఇలాంటి దారుణాలు జరగకుండా పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.

చదవండి: విషాదం: ముఖానికి కవర్, ఉరి వేసుకుని లేడీ టెక్కీ ఆత్మహత్య

చదవండి: ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసింది: పిల్లల ముందే ఘోరం

చదవండి: పబ్ జీ గేమ్ పిచ్చి.. ఫోన్‌లో అయిపోయిన బ్యాటరీ.. ఆ కోపంలో కాబోయే బావపైనే కత్తితో దాడి..

- Advertisement -