ఆర్ ఆర్ ఆర్ బాహుబలిని దాటుతుందా?

RRR Latest Movie News, Bahubali News, Tollywood Latest News, Newsxpressonline
- Advertisement -
హైదరాబాద్: బాహుబలి లాంటి భారీ బడ్జెట్ చిత్రం తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి చేస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ మూవీని డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇద్దరు రియల్ హీరోస్ కథతో వస్తుందని తెలిసిందే.

కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో తారక్, రాం చరణ్ కనిపిస్తున్నారు. 3 షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ఓ భారీ షెడ్యూల్ కు సన్నద్ధం అవుతుంది. ఆ షెడ్యూల్ లో సినిమాకు సంబందించిన ముఖ్యమైన సన్నివేశాలు షూట్ చేస్తారని తెలుస్తుంది. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు.

బాహుబలితో తెలుగు సినిమా స్టామినా ఏంటో తెలిసేలా చేసిన జక్కన్న ఆర్.ఆర్.ఆర్ తో దాన్ని మించేలా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు కాబట్టి అది పెద్ద లెక్కేం కాదని చెప్పొచ్చు. అందుకే సినిమా మొదటి ప్రెస్ మీట్ రోజే రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేసి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడు రాజమౌళి.

అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ మరో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. అభిమానులు అంచనాలు ఎలా ఉంటాయో ఆ అంచనాలకు ఓ మెట్టు ఎక్కువే ఉండేలా ఆర్.ఆర్.ఆర్ ఉంటుందని తెలుస్తుంది. 2020 జూలై 30 రిలీజ్ కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.

- Advertisement -