హైదరాబాద్: తన తాజా చిత్రం ‘మహర్షి’ ఘనవిజయం సాధించడంతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్నారు. ఈ చిత్రం సక్సెస్ మీట్ ఇటీవల విజయవాడలో జరిగింది. ఈ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న మహేష్ తన అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన మనోభావాలు ఆయన మాటల్లోనే…
ఆంధ్రా హాస్పటల్స్ నుండి ఒకాయన వచ్చి, హాస్పటల్‌లో పిల్లలకు సర్జరీ చేసేటప్పుడు హాయిగా నవ్వుతారు అని, దీనికన్నా గొప్ప కాంప్లిమెంట్ నా జీవితంలో వినలేదు సార్. థాంక్యూ మీతో అసోషియేట్ కావడం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. అలానే హైదరాబాద్‌లోనూ ఓ ఆర్గనైజేషన్ ఉంది.
సంవత్సరానికి ఎంతమంది పిల్లల్ని కాపాడుతున్నారో ఆ దేవుడికే తెలుసు. వాళ్లతో కూడా అసోషియేట్ అయ్యాం. వాళ్లతో కలిసి పనిచేయడం చాలా ఆనందం ఉంది. విజయవాడకు వచ్చి కనకదుర్గమ్మను దర్శించుకుని ఫంక్షన్‌కి వస్తే, ఆ ఫీలింగే వేరు. ఇది నేను ఎప్పుడూ ప్లాన్ చేసింది కాదు. నా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ దుర్గమ్మ తల్లి నన్ను పిలుస్తోంది. నాకు చాలా ఆనందంగా ఉంది.
రాఘవేంద్రరావుగారికి ధన్యవాదాలు చెప్పాలి…
నేను 25 సినిమాలు చేశానంటే మొదటిగా మామయ్య రాఘవేంద్రరావుగారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నేను రాజకుమారుడు సినిమా చేస్తున్నప్పుడు ఓ పది రోజులు పాటు ఎలా నడవాలో తెలియదు. ఎలా మాట్లాడాలో తెలియదు. ఒక ఫ్రెండ్‌లా నన్ను చూసుకున్నారు.
‘రాజకుమారుడు’ సినిమా చూసిన తరువాత కూడా నాకు ఆ సినిమా అర్ధం కాలేదు. ఇదేంటి మామయ్య సినిమా ఇలా ఉంది? అని అడిగా.. ఇది పెద్ద హిట్ అవుతుంది. నువ్ సూపర్ స్టార్ అవుతావు అన్నారు. ఆయన అన్నట్టుగానే జరిగింది. ఇప్పుడు దిల్ రాజు, దత్, పీవీపీ గారు సంయుక్తంగా నా 25వ సినిమాని ప్రొడ్యూస్ చేయడం గర్వంగా ఉంది.
నాన్న గారి అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మీకు సినిమా నచ్చితే ఎలా చేస్తారో నాకు తెలుసు. నా 25 సినిమా అన్ని బ్లాక్ బస్టర్స్‌ని దాటేసేలా చేశారు.. మీకు సలాం. థాంక్యూ సోమచ్. మీ గురించి మాటల్లేవ్.. చేతులెత్తి దండం పెట్టడం తప్ప’ అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపే స్పీచ్ ఇచ్చారు మహేష్.








