
అజ్ఞాతవాసి తర్వాత పవన్ పూర్తిగా షేప్ అవుట్ అయ్యాడు. గెడ్డం బాడీ ఇలా ఏదీ కంట్రోల్ లో లేదు. సో అదే పనిగా ప్రత్యేకంగా సామాగ్రి తెప్పించుకుంటున్నాడు అంటే సినిమాల కోసమే అని వాళ్ళ వెర్షన్. రిజల్ట్స్ వచ్చాక గెడ్డం లేకుండా తన పాత గెటప్ లోకి వచ్చేస్తాడని అంటున్నారుఒకవేళ ఈ వార్త నిజమైతే ముందుగా సంబరపడేది మైత్రి సంస్థనే.
వాళ్ళకే ఫస్ట్ కమిట్ మెంట్ పెండింగ్ ఉంది. తర్వాత పవన్ చేస్తాను అని చెప్పాలే కానీ దర్శక నిర్మాతలు క్యూ కడతారు. ఏడాది గ్యాప్ మాత్రమే కాబట్టి అభిమానులకు ఆ లోటు పెద్దగా తెలిసిరాదు. అయితే సినిమాలకు స్వస్తి చెబుతూ ఇకపై చేయనని పవన్ పలుమార్లు ప్రకటించాడు.
ఇప్పుడు అదే మాట మీద కట్టుబడి ఉంటాడా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. అనిష్చితికి మారుపేరైన రాజకీయాలు సినిమాలు రెండు వైపులున్న కాయిన్ లాంటివి. కాబట్టి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్న రూల్ ఏమి లేదు. సో పవన్ మేకప్ వేసుకున్నా ఆశ్చర్యపోయే పనుండకపోవచ్చు.








