నేను ఓడిపోతా కానీ.. మా పార్టీకి 30 సీట్లు గ్యారెంటీ: కేఏ పాల్

11:13 am, Mon, 20 May 19
Chandrababu Latest News, KA Paul Latest News, Newsxpressonline

హైదరాబాద్: ఎగ్జిట్ ఫలితాలపై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయని, ఈ ఎలక్షన్ ఫ్రాడ్ అనినే తాను ముందుగానే చెప్పానని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)న్నీ ట్యాంపరింగ్ కు గురి అయ్యాయని ఆరోపించారు.

ఇక తాను పోటీ చేసిన నర్సాపురం లోక్ సభ స్థానంలో చాలా ఫిర్యాదులు వచ్చాయనీ చెప్పారు.  తాము హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేస్తే ఫ్యానుకు పడిందని ప్రజలు ఫిర్యాదు చేశారని వ్యాఖ్యానించారు.

అయితే ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతానని కానీ….మా పార్టీకి  30 ప్లస్ సీట్లు వస్తాయని చెప్పారు. ఇక టీడీపీకి 90-100 సీట్లు వచ్చినా, లేక వైసీపీకి 90-100 సీట్లు వచ్చినా..మాకు మాత్రం 30 స్థానాలు కచ్చితంగా వస్తాయని ఆ వీడియోలో చెప్పారు. ఇక ఎగ్జిట్ పోల్స్ పై దీన్నే తన కామెంట్ గా పరిగణించాలని మీడియా ఛానల్స్‌కు పాల్ విజ్ఞప్తి చేశారు.

చదవండికేఏ పాల్‌కు సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి