
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమాను ఏపీలో ఎన్నికలకంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశారు వర్మ.
అయితే ఈ సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా కొన్ని అంశాలను చూపించడంతో ఈ సినిమాను అసెంబ్లీ ఎన్నికల ముందు రిలీజ్ చేయకూడదని కొందరు టీడీపీ నాయకులూ ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేశారు.
చదవండి: కాజల్ అగర్వాల్‌కు అతడంటే పిచ్చి అట! ఎవరతడు? ఏమా కథ?
ఈ ఇష్యూ నేపథ్యంలో వర్మ మొదట తెలంగాణలో ఈ సినిమాను రిలీజ్ చేసేశారు.. కాగా, ఈ సినిమా మిశ్రమ టాక్‌తో పర్వాలేదనిపించింది.. విషయానికొస్తే .. ఈ సినిమాను మే 1 న ఏపీలో రిలీజ్ చేస్తామని వర్మ చేసిన వాగ్దానాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
నిజానికి ఈ సినిమాను మార్చిలోనే ఏపీ ,తెలంగాణాలో రిలీజ్ చేస్తానని వర్మ తెలిపినా కూడా కొన్ని రాజకీయ అడ్డంకుల వల్ల , ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించేలా ఉందని, రాజకీయ పార్టీల గెలుపు, ఓటమిలపై సినిమా ప్రభావం చూపుతుందని భావించి… ఈ సినిమాను మే 23వ తేదీ వరకు విడుదల చేయకూడదని ఏపీ హైకోర్టు చెప్పింది.
ఈ నేపథ్యంలో మే 1న సినిమా విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించడంతో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
చదవండి: హైకోర్టును ఆశ్రయించిన హీరో విశాల్
ఏది ఏమైనా కూడా ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలకు సంబంధించి.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంత వరకు తాము గతంలో జారీ చేసిన ఉత్తర్వులు వర్తిస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆ చిత్ర ప్రొడ్యూసర్‌కు ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించి ఏప్రిల్ 10న ఈసీ ఒక లేఖ రాసింది.
ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఎన్నికలకు విఘాతం కలిగించే బయోపిక్‌లు ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాకూడదని ఆ లేఖలో స్పష్టంగా వెల్లడించింది. అయినా సరే, ఈ సినిమాను బుధవారం రిలీజ్ చేస్తానని దర్శకుడు వర్మ అన్నట్లు సమాచారం. మరి ఈసీకి, వర్మకు మధ్య జరుగుతున్న ఈ ఇష్యూ ఎంతవరకు వెళుతుందో రేపు చూడాలి.








